ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?

23 Sep, 2022 20:16 IST|Sakshi
ధర్నా చేస్తున్న బాధిత యువతి, దిశ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ సభ్యులు   

పొదలకూరు(నెల్లూరు జిల్లా): ఏడేళ్లుగా ప్రేమించి, మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చేజర్ల మండలం ఏటూరుకు చెందిన యువతి,  పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన హరినారాయణ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
చదవండి: స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిపోయాడు..

ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని యువతి కోరగా, ఆ యువకుడు స్పందించలేదు. దీంతో బాధితురాలు ప్రియుడు హరినారాయణ తనను నమ్మించి మోసం చేశాడంటూ దిశ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ స్టేట్‌ సెక్రటరీ అరుణ, సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను ఎస్సీ కులం కావడంతో హరినారాయణ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. పోలీసులు వెంటనే హరినారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేసింది. హరినారాయణతోనే తన వివాహం జరిపించాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు