ఘోర రోడ్డు ప్రమాదం: యువతి మృతి.. తెగిపోయిన యువకుడి చేయి

19 Oct, 2022 09:55 IST|Sakshi

కర్ణాటక: బెంగళూరులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా ఓ యువకుడి చేయి తెగిపోయింది. వివరాలు...ఆర్టీ నగర్‌కు చెందిన సనాసాహిబా (18), జిషాన్‌ స్నేహితులు, ఒకే కళాశాలలో చదువుతున్నారు.  

మంగళవారం జిషాన్‌ పుట్టిన రోజు కావడంతో స్నేహితురాలిని డ్యూక్‌ బైక్‌లో తీసుకుని దేవనహళ్లికి వెళ్తుండగా జక్కూరు ఫ్లై ఓవర్‌ వద్ద బైక్‌ నియంత్రణ తప్పి రోడ్డు డివైడర్‌ను వేగంగా ఢీకొంది. ప్రమాదం ధాటికి యువతి తలకు తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందగా జిషాన్‌ కుడిచేయి తెగిపోయింది. స్థానికులు జిషాన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు