ఫేస్‌బుక్‌ ప్రేమ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరికి

4 Oct, 2021 07:23 IST|Sakshi

కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, తాడేపల్లిరూరల్‌: ఫేస్‌బుక్‌ పరిచయం ఓ యువతి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారి సదరు యువకుడు చేతిలో మోసపోయి ఆ యువతి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దుగ్గిరాల ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్‌ఐ ప్రతాప్‌ కథనం మేరకు.. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన యువతికి నిజాంపట్నం మండలం ప్రజ్ఞ గ్రామానికి చెందిన కె.శివగోపి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. పరిచయం పెరిగి ప్రేమగా మారింది. యువతిని శివగోపి పెళ్లి చేసుకుంటానని నమ్మించి  శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం, అనంతరం వివాహం చేసుకోనని చెప్పడంతో ఆ యువతి మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి తండ్రి వెంకటేశ్వరరావు  ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు