చేతబడి భయం.. యువతిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగికదాడి.. కడుపునొప్పి రావడంతో

6 Jan, 2022 20:27 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(సూళ్లూరుపేట): చేతబడి చేస్తానని బెదిరించి ఓ యువతిపై 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఐ.వెంకటేశ్వర్లురెడ్డి కథనం మేరకు.. శ్రీహరికోట శబరి గిరిజన కాలనీకి చెందిన యువతిని కాదలేటి గోపాల్‌ అనే వ్యక్తి చేతబడి పేరుతో భయపెట్టి ఐదునెలలుగా లైంగికదాడి చేస్తున్నాడు.

చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..)

ఈ విషయం బయట చెబితే ఆమె తల్లిదండ్రులపై చేతబడి చేస్తానని బెదిరించాడు. ఈక్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో అతడు గర్భం పోవడానికి ఆమెకు మాత్రలిచ్చాడు. యువతికి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు గత శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చికిత్స చేశారు. ఈక్రమంలో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఆమె తల్లిదండ్రులు తడ మండలంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు యువతి చెప్పింది. పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్‌ ఇచ్చి..)

మరిన్ని వార్తలు