తమ్ముడే అక్కను కడతేర్చాడా?

10 Aug, 2020 12:33 IST|Sakshi
శివరాణిౖ(ఫెల్‌)

పులివెందుల: పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఆదివారం హత్య జరిగింది. పోలీసుల కథనం మేరకు ఎస్బీఐ కాలనీలో నివాసం ఉన్న శివరాణి(35) గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది.ఈమె తన భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయి ఒంటరిగా నివాసం ఉండేది.ఇద్దరు కుమారులను భర్త వద్దనే వదిలేసి వచ్చింది. పులివెందులలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఆదివారం ఉదయం10 గంటలు అవుతున్నా శివరాణి ఇంటినుంచి బయటికి రాలేదు. దీంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ సంఘటాన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తలపై బలమైన గాయాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

తమ్ముడే కడతేర్చాడా?
శివరాణి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.శివరాణి తండ్రి ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ రిటైరయ్యారు. మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె శివరాణి. రెండో భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల రెండో భార్య కుమారునికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమార్తె బంధువులకు శివరాణి ఫోన్‌ చేసి తమ్మునిపై లేనిపోని మాటలు చెప్పింది. వివాహం రద్దయ్యేలా చేసింది. దీంతో అతను శివరాణిపై కక్ష పెంచుకున్నాడు . ఈనేపథ్యంలో హత్య జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శివరాణికి పట్టణంలోని యువకునితో వివాహేతర సంబంధం ఉంది. వడ్డీ డబ్బుల విషయంలో ఆమె దురుసుగా ప్రవర్తిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా