మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని..

11 May, 2022 10:03 IST|Sakshi

బొమ్మనహళ్లి(బెంగళూరు): తన మాజీ ప్రియురాలి ప్రియున్ని హత్య చేశాడో దుండగుడు. హతుడు శివమొగ్గ జిల్లాకు చెందిన సమర్థ్‌ నాయర్‌ (28). మాజీ ప్రియుడు కిరణ్, అతని స్నేహితులు అరుణ్, రాకేష్‌లను బొమ్మనహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి ఒక ప్రముఖ గార్మెంట్స్‌లో సమర్థ్‌ నాయర్‌ క్వాలిటీ కంట్రోలర్‌గా పని చేస్తున్నాడు. మూడు నెలలు ఢిల్లీలో ఉండి మళ్లీ ఏప్రిల్‌ 26వ తేదీన వచ్చాడు. 

చనువుగా ఉండడం చూడలేక
అదే గార్మెంట్స్‌లో పనిచేసే భద్రావతికి చెందిన యువతిని సమర్థ్‌ ప్రేమిస్తున్నాడు. ఇతనికంటే ముందు గార్మెంట్స్‌లో ఉద్యోగం చేసిన కిరణ్‌  ఈ యువతిని ప్రేమించాడు, గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. తన మాజీ ప్రేయసితో సమర్థ్‌ చనువుగా ఉండడాన్ని కిరణ్‌ తట్టుకోలేకపోయాడు. స్నేహితులతో కలిసి ఈ నెల 8వ తేదీన డ్యూటీ ముగించుకుని బయటకు వచ్చిన సమర్థ్‌తో గొడవపడ్డారు. అతని తలను గోడకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమర్థ్‌ను ఆస్పత్రికి తరలించగా, సోమవారం సాయంత్రం చనిపోయాడు.

చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్‌ కొన్న సురేష్‌రెడ్డి!

మరిన్ని వార్తలు