వివాహేతర సంబంధం: మహిళ సోదరుడికి తెలియడంతో..

14 Aug, 2022 17:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాయచూరు రూరల్‌(బెంగళూరు): జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కకొట్నేకల్‌లో శుక్రవారం సాయంత్రం వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణపై ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. మాన్వి పోలీసుల వివరాలు.. వీరేష్‌(25) అనే యువకుడిని హనుమేష్‌ అనే వ్యక్తి హత్య చేశాడు. హనుమేష్‌ సోదరితో వీరేష్‌ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు.

ఇది గమనించిని హనుమేష్‌ అతని తీరు మార్చుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. అయితే ఆ మాటలను వీరేష్‌ పట్టించుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆ యువకుడిని హత్య చేశాడు హనుమేష్‌. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటప్ప నాయక్‌ తెలిపారు.

చదవండి: 19 ఏళ్ల యువకుడిని ట్రాప్‌ చేసిన మహిళ.. హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన తండ్రి

మరిన్ని వార్తలు