కిరణా వ్యాపారం.. ఆశలన్నీ కొడుకుపైనే.. కళ్ల ముందే..

29 Nov, 2021 09:12 IST|Sakshi

 సాక్షి,శ్రీకాకుళం రూరల్‌: సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘట న పెదగనగళ్లవానిపే ట తీరంలో ఆదివారం చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని బోడెమ్మ కోవెల ప్రాంతంలో నివాసం ఉంటున్న కాశం రమేష్‌ కిరణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నవాడైన సురేంద్ర (17) నగరంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్నా డు.

కార్తీక మాసం కావడంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి పెదగనగళ్లవాని పేట సమీపంలోని సరుగు తోటల్లో పిక్నిక్‌ జరుపుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సముద్రంలో స్నానాలకు దిగారు. అలలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో సురేంద్ర గల్లంతైనట్లు ప్రత్యేక సాక్షు ల ద్వారా తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల వరకూ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. 

చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..

మరిన్ని వార్తలు