కాలేజ్‌ వద్ద డ్రాప్‌ చేస్తానని నమ్మించి.. కొంచెం దూరం వెళ్లాక..

16 Aug, 2022 15:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కెలమంగలం(బెంగళూరు): బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థినిని కళాశాల వద్ద దించుతానని నమ్మించి తీసుకెళ్తూ కళాశాల వద్ద దించకపోవడంతో కిందకు దూకిన విద్యార్థినికి తీవ్రంగా గాయపడిన ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. కెలమంగలం సమీపంలోని మంజళగిరి గ్రామానికి చెందిన 18 ఏళ్ల విద్యార్థిని కెలమంగలం సమీపంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతోంది.

శనివారం ఉదయం బస్టాప్‌ వద్ద బస్సుకోసం వేచియుండగా ఆ మార్గంలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు కళాశాల వద్ద వదలిపెడుతానని నమ్మించి విద్యార్థినిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్లాక ఎవరూ లేని ప్రదేశంలో తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని బైక్‌పై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. 

మరిన్ని వార్తలు