ఒంటరి మహిళలే టార్గెట్‌.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు

16 Oct, 2021 15:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: ఎంతటి వాడైన, ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా వంద మందిపైగా మ‌హిళ‌ల‌ను వేధించిన సైకోకి చెన్నై పోలీసులు చెక్‌ పెట్టారు. నార్త్ జ‌గ‌న్నాధ‌న్‌న‌గ‌ర్‌కు చెందిన దినేష్ కుమార్ ఇటీవల ఓ రోజు ఆర్మీ అధికారి కూతురును వేధించ‌డంతో దినేష్‌ బండారం మొత్తం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని క్యాటరింగ్ కళాశాలలో చదువుతున్న దినేష్‌ కుమార్, కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులలో పాల్గొంటూ, చెన్నై ఎగ్‌మోర్ పరిసరాల్లోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే అతను రాత్రి లేదా ఉదయాన్నే ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించేవాడు. ఈ క్రమంలో గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ ఆఫీసర్‌తో కలిసి ఉదయం వాకింగ్‌ చేస్తుండగా, ఆ సమయంలోనే దినేష్‌ ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఆ యువతి తన ఇద్దరు కుటుంబ సభ్యుల వెనుక నడుస్తోంది. (చదవండి: Drown In Pond:‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’.. )

దీంతో తను ఒంటరిగా ఉందని భావించి తనతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళ తండ్రి దినేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే అతను బైకు మీద ఉడాయించాడు. ఆర్మీ ఆఫీసర్‌ అతని బండి నంబర్‌ని నోట్‌ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని బైకు రిజిస్ట్రేషన్ నంబర్‌ ఆధారంగా అతని బండిని ట్రాక్ చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీని పరీశిలించారు. చివరికి అతని ఆచూకి కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఇప్ప‌టివ‌ర‌కూ 100 మంది మ‌హిళ‌ల‌ను వేధించాన‌ని పోలీసుల ఎదుట నిందితుడు అంగీక‌రించాడు.

చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘

మరిన్ని వార్తలు