ఎస్‌ఐ వేధింపులు.. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌ లైవ్‌లో..

14 Jul, 2022 15:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి బెంగళూరు: ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్‌ లైవ్‌లో తెలిపిన విజయపుర వాసి సోమనాథ్‌ నాగమోతి(25)  కోల్హార వద్ద కృష్ణా నదిలో శవమై తేలాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఏపీఎంసీ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ సోమేశ్‌ గెజ్జి సోదరుడు సచిన్‌ గెజ్జి కారులో రూ. లక్ష నగదు గల్లంతైంది. ఆ నగదును సోమనాథ దొంగతనం చేశాడనే అనుమానంతో ఎస్‌ఐ అతన్ని పోలీసు స్టేషన్‌కు పిలిపించాడు.

డబ్బు తిరిగి వాపస్‌ ఇవ్వాలని హింసించాడు. ఆవేదనకు గురైన సోమనాథ్‌ నాగమోతి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ లైవ్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్‌ స్పందిస్తూ పోలీసు శాఖ  అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని తెలిపారు. దర్యాప్తు తర్వాత నిజానిజాలు తెలుస్తాయన్నారు.

చదవండి: గుజరాత్‌లో 'ఆట' రష్యా నుంచి డబ్బుల 'మూట'.. బయటపడ్డ ఫేక్‌ ఐపీఎల్‌ బండారం

మరిన్ని వార్తలు