ఫోన్‌లో పరిచయం.. యువతిని ప్రేమించా.. పెళ్లి చేయకుంటే చంపుతా

28 Sep, 2022 13:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): యువతిని ప్రేమించానని, తనకు ఇచ్చి పెళ్లి చేయకుంటే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి.నైనవరం గ్రామానికి చెందిన జమ్మాని వెంకటలక్ష్మి, రాము దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భవ్య(19)కు ఏడాది కిందట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తరుణ్‌ తేజ్‌తో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది.
చదవండి: ‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం

అప్పటి నుంచి తరుణ్‌తేజ్‌ భవ్యను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఇటీవల వెంకటలక్ష్మి బంధువులు తరుణ్‌తేజ్‌ గురించి ఆరా తీశారు. అయితే తరుణ్‌ తేజ్‌ నడవడిక మంచిది కాదని తెలియడంతో పెళ్లికి ఇష్టం లేదని చెప్పారు. అయితే అప్పటి నుంచి తరుణ్‌తేజ్‌ భవ్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా  వారి గ్రామానికి వచ్చి పెళ్లి చేయకుంటే చంపుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆందోళన చెందిన వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు