పోలీసుల అదుపులో కౌన్సిలర్ హత్య కేసు నిందితుడు

11 Aug, 2021 08:56 IST|Sakshi
హత్యకు గురైన కౌన్సిలర్ వెంకట సురేష్‌

సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిల్‌ సభ్యుడు తాళ్లూరు వెంకట సురేష్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న క్లూతో పోలీసులు గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ హత్య కేసులో పురోగతి సాధించారు. ఈ హత్యలో నలుగురు కిరాయి హంతకులు పాల్గొన్నట్లు సమాచారం తెలియడంతో వారి కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల అనుసరించి ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు