వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

9 Oct, 2020 09:14 IST|Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బరాయుడు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి కర్రలతో కొట్టి హత్యచేశారు. విజయ పాల డెయిరీ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తోంది.  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే శిల్పా
వైఎస్సార్‌సీపీ నాయకుడు సుబ్బరాయుడు హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు