టీకా వచ్చిన 4 వారాలల్లోనే అందరికీ ఇస్తాం

28 Nov, 2020 16:42 IST|Sakshi

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. పాలిక్లినిక్స్ లాంటి సదుపాయాల ఏర్సాటు చేసి  ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు ప్రధాన నగరాల్లో పర్యటించిన నేపథ్యంలో సత్యేందర్ జైన్ ఈ మేరకు ప్రకటన చేశారు.

వ్యాక్సిన్‌ పురోగతిని సమీక్షించనున్న ప్రధాని
కరోనా వైరస్ వ్యాక్సిన్‌ పురోగతిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని జైడస్‌ క్యాడిలా ప్లాంట్‌, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పురోగతిని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. జైడస్ కాడిలా తన టీకా జైకోవ్-డికు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్ విజయవంతంగా ముగిసిందని ఇది వరకే ప్రకటించింది. ఆగస్టు నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా ప్రారంభించింది. మరోపక్క భారత్ బయోటెక్ కోవాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం మూడో దశలో కొనసాగుతోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) టీకా తయారీ కోసం గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో కలిసి పని చేస్తోంది.
 

మరిన్ని వార్తలు