ఇప్పటివరకు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే

2 May, 2021 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం తాండవం చేస్తోంది. కరోనా వైరస్ తొలిదశ కంటే రెండోదశ విజృంభించడంతో కేసుల సంఖ్యతో పాటూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. తొలిదశలో రోజూవారి నమోదయ్యే కేసుల సంఖ్య వేలల్లో ఉంటే కోల్పోయే ప్రాణాలు పదుల్లో ఉండేవి. కానీ రెండో దశలో అలా కాదు కరోనా దాని స‍్వరూపం మార్చేసి సామాన్యుడిపై ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కభళించేందుకు దూసుకు రావడంతో రోజూ వారి కేసుల సంఖ్య మూడు నుంచి నాలుగు లక్షలు కరోనా సోకుతుంటే మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి.దీనికి తోడు దేశంలో ఎన్నికల నిర్వహణ కరోనా వ్యాప్తికి మరింత ఊతమిచ్చినట్లైంది. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు తాత్కాలిక లాక్‌ డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 11,21,102 పైగా కరోనా సోకగా.. వారిలో 9,82,297 మందికి తగ్గుముఖం పట్టింది. 8053 మంది మరణించారు. ఇక తెలంగాణలో 4,51వేల మందికి కరోనా సోకి.. 3లక్షల 68వేల మందికి తగ్గింది. 2,368 మంది మరణించారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు  నైట్‌ కర్ఫ్యూని విధించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఏ రాష్ట్రాల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడ లాక్‌ డౌన్‌ విధించారో తెలుసుకుందాం. 

State/UT   Confirmed Cases Active Case  Cured/Discharged Death  Lockdown/Curfew Status
అండమాన్/ నికోబార్ దీవులు 6046 205 5773 68
ఆంధ్రప్రదేశ్ 1121102 130752 982297 8053 నైట్ కర్ఫ్యూ రాత్రి 10 నుండి 5 వరకు
అరుణాచల్ ప్రదేశ్ 18636 1387 17190 59 పాక్షిక లాక్‌ డౌన్‌ 
అస్సాం 256576 26374 228872 1330 నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 6 వరకు
బీహార్ 484106 108203 373261 2642 నైట్ కర్ఫ్యూ సాయంత్రం 6 నుండి 6 వరకు
 చండీగఢ్‌ 43446 7222 35735 489 వారం రోజుల లాక్‌ డౌన్‌ 
 ఛత్తీస్‌గఢ్‌ 744602 121099 614693 8810 ఎనిమిది జిల్లాల్లో లాక్‌ డౌన్‌
దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డియు 7712 1867 5841 4
ఢిల్లీ 1174552 96747 1061246 16559 మే 10వరకు లాక్‌ డౌన్‌ కొనసాగింపు 
గోవా 93355 23884 68249 1222 మే 3 వరకు లాక్‌డౌన్
గుజరాత్ 581624 145139 429130 7355 20 నగరాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు
హరియాణా  501566 102516 394709 4341 మే 31 వరకు పాక్షిక లాక్డౌన్ & నైట్ కర్ఫ్యూ
హిమాచల్ ప్రదేశ్  102038 19928 80585 1525 మే 10 వరకు 4 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ
జమ్మూ- కాశ్మీర్ 179915 30343 147242 2330 మే 3 వరకు  11 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ
జార్ఖండ్  239734 58437 178468 2829 మే 6 వరకు లాక్‌ డౌన్‌ 
కర్ణాటక 1564132 405088 1143250 15794 మే 9 వరకు కరోనా కర్ఫ్యూ
కేరళ  1606819 324169 1277294 5356  రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ
లడఖ్ 14086 1400 12542 144 వీకెండ్ కర్ఫ్యూ
లక్షద్వీప్ 2923 1438 1481 4
మధ్యప్రదేశ్ 575706 88511 481477 5718 కరోనా కర్ఫ్యూ మే 7 వరకు
మహారాష్ట్ర 4665754 665837 3930302 69615 మే 15 వరకు లాక్డౌన్
మణిపూర్ 31905 1652 29843 410 మే 7 వరకు లాక్డౌన్
మేఘాలయ  17108 1659 15275 174
మిజోరం  6299 1299 4985 15
 నాగాలాండ్ 14134 1353 12674 107 నైట్ కర్ఫ్యూ
ఒడిశా  454607 61505 391048 2054 నైట్ కర్ఫ్యూ
పుదుచ్చేరి 60001 10263 48921 817
పంజాబ్ 377990 58229 310601 9160 నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 5 వరకు
రాజస్థాన్ 615653 182301 428953 4399 మే 3 వరకు లాక్డౌన్
సిక్కిం 8211 1647 6416 148
తమిళనాడు 1186344 117405 1054746 14193 నైట్ కర్ఫ్యూ మరియు ఆదివారం పూర్తి లాక్డౌన్
 తెలంగాణ 450790 80695 367727 2368 రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు
త్రిపుర 35589 1471 33720 398
ఉత్తర ప్రదేశ్ 1282504 301833 967797 12874 మే 4 వరకు లాక్డౌన్
ఉత్తరాఖండ్ 186014 51127 132156 2731 మే 1 వరకు లాక్డౌన్
పశ్చిమ బెంగాల్ 845878 116659 717772 11447


 

మరిన్ని వార్తలు