‘అది మీ పథకమే.. మేం ఏ పేరు పెట్టలేదు’

20 Mar, 2021 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ‘ఇంటింటికి రేషన్‌ బియ్యం’ పంపిణీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ఈ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇక పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ తాము వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ పథకం అమలు విషయంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

చదవండి: సీఎం జగన్‌ పథకాల స్ఫూర్తితో మమతా బెనర్జీ

‘దీనికి ముఖ్యమంత్రి రేషన్‌ యోజన అనే పేరు పెట్టడం లేదు. ఈ పథకానికి ఎలాంటి పేరు లేదు’ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. పేదలకు అందించే చౌకధరల వస్తువల సరఫరాలో మాఫియా ప్రవేశించిందని.. వారిని నుంచి కాపాడేందుకు ఇంటింటికి రేషన్‌ అమలు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం వివరణ ఇచ్చారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగానే ఇంటింటికి రేషన్‌ పథకం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఢిల్లీ ఆహార శాఖ మంత్రి సంయుక్త కార్యదర్శి జగన్నాథన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ పథకం కేంద్రానిదే, మేం కేవలం అదనపు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. సహదార జిల్లా సీమపురి ప్రాంతంలో ఈ పథకం అమలు చేయనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేసే యోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది. 

Read latest Delhi News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు