గుంతలో పడ్డ లారీ ...ఎలా పడిందో చూడాల్సిందే

20 May, 2021 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్క‌సారిగా కురిసిన కుంభ‌వృష్టికి ఢిల్లీ ప్రధాన ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల‌పై నీళ్లు నిలువ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల రోడ్లు మీద గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నజాఫ్‌గఢ్‌లో ప్రధాన రహదారి మీదగా వస్తున్న ట్రక్కు రోడ్డు మీద ఏర్పడిన గుంతలో పడిపోయింది. లారీ వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(చదవండి:వింత పదార్థం.. ఇదేంటో తెలిస్తే మాకు చెప్పగలరు)

మరిన్ని వార్తలు