గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకూ ప్రసవాల వివరాలు

28 Mar, 2023 23:44 IST|Sakshi

సాధారణ ప్రసవాలే మేలు

సాధారణ ప్రసవాల వల్ల తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. సిజేరియన్‌ వల్ల బిడ్డకు పాల కొరత రావడంతో పాటు రకరకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. ఈ విషయాన్ని గర్భిణులకు చెబుతున్నాం. అలాగే ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచాం.

– డాక్టర్‌ టీకే శ్రీనివాసరావు,

అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి

సాక్షి, అమలాపురం: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీనిపై గత ఏడాది నవంబర్‌లో జరిగిన దిశా సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ప్రసవాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తోంది. సాధారణ ప్రసవాల వల్ల తల్లీబిడ్డలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం.. గర్భ నిర్ధారణ అయిన నాటి నుంచి, ప్రసవం వరకూ ఆశా వర్కర్ల నుంచి ప్రభుత్వ వైద్యుల వరకూ పర్యవేక్షణ.. అత్యధికంగా సిజేరియన్‌ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా.. వెరసి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ కత్తెరలకు అడ్డుకట్ట పడుతోంది. అమ్మ కడుపు ‘కోత’కు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన ‘స్పెషల్‌ డ్రైవ్‌’ సత్ఫలితాలనిస్తోంది.

ఫ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ జిల్లాలో 21,104 ప్రసవాలు జరగగా, వీటిలో సాధారణం 6,889 (32 శాతం), సిజేరియన్‌ 14,215 (68 శాతం) ఉన్నాయి.

ఫ గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకూ పరిశీలిస్తే మొత్తం ప్రసవాలు 12,934 కాగా, వీటిలో సాధారణం 3,427 (26 శాతం), సిజేరియన్‌ 12,934 (74 శాతం) ఉన్నాయి.

ఫ సిజేరియన్లు ఎక్కువగా జరగడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. సాధారణ ప్రసవాలు చేసుకునేలా గర్భిణుల్లో చైతన్యం కల్పించింది. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ జిల్లాలో 7,170 ప్రసవాలు జరగగా.. వీటిలో సాధారణం 2,809 (39 శాతం), సిజేరియన్‌ 4,361 (61 శాతం) మాత్రమే నమోదయ్యాయి.

ఫ ప్రభుత్వాస్పత్రుల్లో అక్టోబర్‌ నెలాఖరు వరకూ సాధారణ ప్రసవాలు 45 శాతం కాగా, తదనంతరం ఇది 91 శాతానికి పెరిగింది. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్టోబర్‌ వరకూ 15 శాతం కాగా, ఈ సీజన్‌లో అది కాస్తా 34 శాతానికి పెరగడం గమనార్హం.

ఫ ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్‌ 55 నుంచి 9 శాతానికి తగ్గగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 85 నుంచి 66 శాతానికి తగ్గడం విశేషం.

ఫలిస్తున్న చర్యలు

ఫ సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తోంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేంత వరకూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ వైద్యుల ఆధ్వర్యాన నిరంతర పర్యవేక్షణ వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని పక్కాగా అంచనా వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రసవమే మేలని అవగాహన కల్పిస్తున్నారు.

ఫ సాధారణ కాన్పుల వల్ల తల్లీబిడ్డలకు ఆరోగ్యపరంగా జరిగే మేలు వివరిస్తున్నారు. జాతకాలు, నక్షత్ర బలం కోసం, నొప్పులు భరించలేమని సిజేరియన్‌కు మొగ్గు చూసుతున్న వారి ఆరోగ్యానికి కలిగే నష్టాలను తెలుపుతున్నారు.

ఫ ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అమలాపురం గాంధీనగర్‌ వద్ద ఒక ప్రైవేటు ఆస్పత్రితో పాటు రామచంద్రపురం, మండపేటల్లోని మూడు నాలుగు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు. వాటి యాజమాన్యలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. జిల్లాలోని రెండు సీహెచ్‌సీల్లో సైతం అధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. అక్కడి వైద్యులకు కూడా కౌన్సెలింగ్‌ చేశారు.

ఫ సాధారణ కాన్పులకే మొగ్గు

ఫ అవే మేలంటూ వైద్య,

ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక కౌన్సెలింగ్‌

ఫ గర్భిణుల్లో పెరుగుతున్న అవగాహన

ఫ సిజేరియన్‌ వద్దంటున్న అత్యధికులు

ఫ జాతకాల నమ్మకాలు వీడితే

మరింతగా పెరిగే అవకాశం

ఆస్పత్రులు సాధారణం సిజేరియన్‌ మొత్తం సాధారణ సిజేరియన్‌

ప్రసవాలు ప్రసవాలు ప్రసవాలు ప్రసవాల శాతం శాతం

ప్రభుత్వం 1,694 2,041 3,735 45 55

ప్రైవేటు 1,386 7,813 9,199 15 85

మొత్తం 3,427 9,507 12,934 26 74

గత ఏడాది నవంబర్‌ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ..

ప్రభుత్వం 505 48 553 91 9

ప్రైవేటు 2,304 4,313 6,617 34 66

మొత్తం 2,809 4,361 7,170 39 61

>
మరిన్ని వార్తలు