-

అద్దాల మండపం ప్రారంభం

28 Mar, 2023 23:44 IST|Sakshi
శేషవాహనానికి ఈఓ కృష్ణచైతన్య ప్రత్యేక పూజలు

ఆత్రేయపురం: ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో దాత విరాళంతో అద్దాల మండపం నిర్మించినట్టు ఈఓ బి.కృష్ణచైతన్య తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పాపన్నశర్మ, విమల రూ.1.50 లక్షల విరాళంతో నిర్మించిన ఈ మండపాన్ని ఈఓ మంగళవారం ప్రారంభించారు. అలాగే ఈతకోటకు చెందిన కొంపెల్ల రాంబాబు, శైలజ రూ.70 వేల విలువైన 37 కేజీల ఇత్తడి శేషవాహనాన్ని స్వామి వారికి సమర్పించారు. సంప్రోక్షణ, హోమం, శాంతి కల్యాణం అనంతరం నూతన శేష వాహనంపై స్వామి వారి ప్రదక్షిణలు నిర్వహించారు. దాతలను సత్కరించారు.

ఫస్టియర్‌ పరీక్షలకు 12,770 మంది హాజరు

రాయవరం: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 12,770 మంది హాజరయ్యారు. మొత్తం 13,607 మంది హాజరు కావాల్సి ఉండగా, 837 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 11,735 మందికి గాను 11,203 మంది పరీక్ష రాశారు. 532 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 1,872 మందికి గాను 1,567 మంది హాజరయ్యారు. 305 మంది పరీక్ష రాయలేదని ఇంటర్మీడియెట్‌ బోర్డు డీవీఈఓ ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు