రక్త సంబంధీకులు వస్తే శిశువును ఇస్తాం

14 Nov, 2023 23:34 IST|Sakshi
కాకినాడ శిశుగృహలో శిశువును అప్పగిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

అమలాపురం టౌన్‌: ఉప్పలగుప్తం మండలం ఎన్‌.కొత్తపల్లిలో ఈ నెల మూడో తేదీన దొరికిన గుర్తు తెలియని ఆడ శిశువును మంగళవారం సాయంత్రం కాకినాడ శిశుగృహకు తరలించారు. జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జీవీ సత్యవాణి ఆధ్వర్యాన ఐసీడీఎస్‌ అధికారులు ఈ శిశువును కాకినాడ తీసుకుని వెళ్లి శిశుగృహలో అప్పగించారు. ఆ శిశువు దొరికినప్పటి నుంచీ అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ శిశువు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో కాకినాడ తరలించారు. శిశువు సురక్షితంగా ఉందని, ఎవరైనా రక్త సంబంధీకులు వస్తే అందజేస్తామని సత్యవాణి చెప్పారు. తగిన ఆధారాలతో కాకినాడ శిశుగృహకు వెళ్లి కూడా ఆ శిశువును తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు