జీజీహెచ్‌లో రోగి ఆత్మహత్య

19 Mar, 2023 02:20 IST|Sakshi
విద్యార్థి, గైడ్‌టీచర్‌ను అభినందిస్తున్న హెచ్‌ఎం

కాకినాడ క్రైం: మనోవేదనకు గురైన ఓ రోగి కాకినాడ జీజీహెచ్‌లో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే సామర్లకోటకు చెందిన చిక్కడాల వెంకటరమణ (50) ఈ నెల 16న ఆస్తమా సమస్యతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిఫరల్‌ ద్వారా కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. సర్జికల్‌ భవంతిలోని ఓపీ ఎస్‌ఎస్‌ఆర్‌ వద్ద ఉన్న ప్రత్యేక శ్వాసకోశ సమస్యల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఉండగా శనివారం తెల్లవారుజామున తన వార్డు నుంచి బయటకు వెళ్లి నిరుపయోగంగా ఉన్న ఓ వార్డులోని ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం సదరు వార్డులో విధులు నిర్వర్తించేందుకు హాజరైన భవన నిర్మాణ కార్మికులు జరిగిన విషయాన్ని గుర్తించి ఔట్‌పోస్టు పోలీసులు, ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంకటరమణ గత నెల వరకూ కాకినాడ జీజీహెచ్‌లో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. ఈ ఘటనపై ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

30 వరకూ లక్ష్మీ హ్యుండాయ్‌

ఉచిత సమ్మర్‌ క్యాంప్‌

రాజమహేంద్రవరం రూరల్‌: స్థానిక లక్ష్మీ హ్యుండాయ్‌ షోరూం ఆధ్వర్యాన ఈ నెల 30వ తేదీ వరకూ ఉచిత సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నారు. షోరూం మేనేజర్‌ సునీల్‌ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. లాలాచెరువు, బొమ్మూరు, అమలాపురం, మలికిపురాల్లోని బ్రాంచిల వినియోగదారులకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సమ్మర్‌ క్యాంపులో భాగంగా ఉచిత ఏసీ చెకప్‌, ఏసీ పరికరాలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఉంటుందని తెలిపారు. ఏసీ సర్వీసింగ్‌పై 15 శాతం, రెఫ్రిసెంట్‌ ఫిల్లింగ్‌పై 10, ఏసీ క్లీనింగ్‌పై 10, ఆర్‌ఎస్‌ఏ రిటైల్‌పై 20, ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌పై 10, మెకానికల్‌ లేబర్‌పై 10 శాతం చొప్పున డిస్కౌంట్‌ ఇస్తామని వివరించారు. వివరాలకు 80966 66396, 80966 66085 నంబర్లలో కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని తెలిపారు.

రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌

పోటీలకు ఎంపిక

గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ మానక్‌ పోటీలకు ఎంపికై నట్టు హెచ్‌ఎం గంధం ప్రమీలారాణి తెలిపారు. ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పదో తరగతి విద్యార్థ్ధి తాడేపల్లి చరణ్‌కార్తీక్‌ తయారు చేసిన మల్టీపర్పస్‌ అగ్రికల్చర్‌ రోబో ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. ఈ నెల చివరి వారంలో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి ఈ ప్రాజెక్టుని ప్రదర్శిస్తాడని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థితో పాటు అతనికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు మండపాక హరిబాబును హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు