పాఠ్య పుస్తకాల్లో కఠిన అంశాలపై వర్క్‌షాపు

24 Sep, 2023 02:30 IST|Sakshi
వర్క్‌షాపులో మాట్లాడుతున్న లెక్చరర్‌ సూర్యనారాయణ

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ (డైట్‌)లో నాల్గో రోజు శనివారం 8, 9 తరగతుల సాంఘికశాస్త్ర పాఠ్య పు స్తకాల్లో కఠిన అంశాల గుర్తింపుపై వర్క్‌షాపు్‌ నిర్వహించారు. దీనికి మూడు జిల్లాల నుంచి సాంఘిక శాస్త్రం బోధిస్తున్న 80 మంది ఉపాధ్యాయులు హాజరై వివిధ అధ్యాయాలపై చర్చించారు. చివరగా ఎనిమిదో తరగతిలో 24 అధ్యాయాలు, తొమ్మిదో తరగతిలో 20 అధ్యాయాలు కఠినతరమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వర్క్‌షాపునకు సమన్వయకర్తలుగా కేవీ సూర్యనారాయణ, కె.గంగాధరరావు, ఎన్‌.ఎస్తేర్‌ వ్యవహరించారు.

మరిన్ని వార్తలు