నేడు నిధి ఆప్‌కే నిఖత్‌ డిస్ట్రిక్ట్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌

26 Oct, 2023 23:58 IST|Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరం ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం 9.00 గంటల నుంచి నిధి ఆప్‌కే నిఖత్‌–డిస్ట్రిక్ట్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తామని అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ వైడీ శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని అపర్ణ ఎంటర్‌ప్రైజస్‌లోను, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తార జూనియర్‌ కళాశాలలోను, కాకినాడ జిల్లా కాకినాడ డైరీఫామ్‌ సెంటర్‌ చంద్ర షిప్పింగ్‌ సర్వీసెస్‌లోను, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీలోను, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం మండలంలో చవిటిదిబ్బలు కెజీబీవీ స్కూల్లోను, గంగవరం మండలంలోని గంగవరం పంచాయతీ కార్యాలయంలోను, మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి వనవిహారిలో నిధిఅప్‌కే నిఖత్‌ జరుగుతుందన్నారు. ఈ నిధి అప్‌కే నిఖత్‌ మెంబర్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో నిర్వహిస్తామన్నారు. పేరుదిద్దుబాటు, బ్యాంకుఖాతాసీడింగ్‌ మొదలైన వాటిపై అవగాహన, యుఏఎన్‌లు, పీఎఫ్‌ నంబర్‌లు బదిలీ/విలీనం, మెంబర్‌ పోర్టల్‌, ఉమాంగ్‌, డిజిలాకర్‌ సేవలు అందించడం జరుగుతుందన్నారు. సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్‌లు, కొత్తగా కవర్‌ చేసిన ఎస్టాబ్లిష్మెంట్‌లు ఈ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలన్నారు. నిధి అప్‌కే నిఖత్‌ అని పేర్కొంటూ తమ ఫిర్యాదులను సమర్పించాలన్నారు. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ బకాయి ఉన్న పింఛనుదారులు, డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించవచ్చని అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

చంద్రగ్రహణం రోజు

పంచారామ క్షేత్రం మూసివేత

సామర్లకోట: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు పంచారామ క్షేత్రాన్ని మూసివేస్తున్నట్టు ఈఓ డి.నాగమల్లేశ్వరరావు గురువారం తెలిపారు. శనివారం రాత్రి 1.05 నుంచి 2.22 వరకు గ్రహణ కాలమని ఆయన తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 29వ తేది ఉదయం ఆలయంలో సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాలను గమనించాలన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల దర్శనాల అనంతరం ఆలయాన్ని మూసివేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు