రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టుల ఎంపిక

11 Nov, 2023 02:44 IST|Sakshi
మండపేట విద్యార్థినులను అభినందిస్తున్న డీఈఓ కమలకుమారి తదితరులు

మండపేట/కొత్తపేట: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రతిభతో మెరిశారు. అమలాపురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో ఇటీవల ఈ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మండపేట, కొత్తపేట మండలం మోడేకుర్రు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. వీరిని డీఈఓ ఎం.కమలకుమారి, జిల్లా సైన్స్‌ అధికారి జీవీస్‌ సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు. మండపేట గౌతమీ మున్సిపల్‌ స్కూల్‌ విద్యార్థులు లావణ్య, స్పందన సరికొత్త ఆలోచనను ఆవిష్కరించారు. పండ్ల తొక్కలు, ఆహార పదార్థాల వ్యర్థాల నుంచి ఇంట్లో దుస్తులు, టాయిలెట్స్‌, ఫ్రిజ్‌ తదితర గృహోపకరణాలు శుభ్రపరచుకునేందుకు అవసరమైన రసాయనాలు తయారు చేయడంపై వారు ఈ ప్రాజెక్టు రూపొందించారు. వారికి జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మేకా రామలక్ష్మి గైడ్‌గా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని సీహెచ్‌ శోభావళి శుక్రవారం ఈ విషయం తెలిపారు. అలాగే, మోడేకుర్రు జెడ్పీ హైస్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు జీహెచ్‌డీవీ సాయి, పి.ఉదయ్‌ శ్రీనివాస్‌లు ‘నో యువర్‌ ఎకో సిస్టమ్‌’ అనే అంశంలో ప్రాజెక్టు రూపొందించారు. ఇది కూడా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ విద్యార్థులకు వి.మురళీకృష్ణారావు గైడ్‌ టీచర్‌గా వ్యవహరించారు. వీరిని సర్పంచ్‌ కుడుపూడి రామలక్ష్మి, ఎంఈఓ–1, 2లు ఎం.హరిప్రసాద్‌, కె.లీలావతి, హెచ్‌ఎం వీవీఎస్‌ రామచంద్రమూర్తి తదితరులు అభినందించారు.

8X5 OBT

మరిన్ని వార్తలు