బరిగీసిన పెత్తందార్లు

18 Sep, 2022 00:23 IST|Sakshi

ఇప్పుడు బరిగీసింది పెత్తందార్లే. వారు యుద్ధ సన్నాహాల దశను దాటి దండయాత్రల దశకు చేరుకున్నారు. ‘అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. దండయాత్రలకెప్పుడూ ముద్దుపేర్లే ఉంటాయి. సారంలో మాత్రం అదొక ఆర్థిక – సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ధనస్వాముల స్వార్థ ప్రాయోజితం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానితోపాటు రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం కావడం, కొద్దిగా ప్రోత్సహిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారగల అవకాశాలు విశాఖకు ఉండటం కూడా ప్రభుత్వం ఆలోచనకు కారణం. అమరావతి వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఈ ఆలోచన ఆటంబాంబులా తోస్తున్నది. ‘నీకు రాజధాని అర్హత లేదు సుమా! తోక ముడుచుకో విశాఖా! కాదంటే ఖబడ్దార్‌!!’ అని హెచ్చరించడానికే ఈ దండయాత్రను నడుపుతున్నారు. విశాఖపట్నం గుండెల మీదుగా దండు నడపాలని సంకల్పించారు. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని మెదడున్న మానవకోటి అనుమానించడం అత్యంత సహజం.

ఎందుకీ కవ్వింపు?. మనుషుల్ని విడదీయడం కోసం, మెదళ్లలో విషబీజాలు నాటడం కోసం, కల్లోలిత వాతావరణాన్ని కల్పించడం కోసం, అంతిమంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం! ఆయన్నెందుకు గద్దె దించాలి? కారణాలు చరిత్ర నిండా కనిపిస్తాయి. పేద ప్రజలూ, కష్టజీవుల మోముల్లో చైతన్యపు ఛాయలు కదలాడిన ప్రతి సందర్భంలోనూ ధనవంతులు దండధారులౌతారు. దండ యాత్ర చేస్తారు. ఇది నియమం. సంకెళ్లు తెంచుకోవాలనే తలంపు బానిసలకు పదేపదే కలుగుతూనే ఉంటుంది. స్పార్టకస్‌ వంటి యోధుని స్ఫూర్తిమంతమైన నాయకత్వం లభించి నప్పుడు వారు చెలరేగిపోతారు. రోమ్‌ మహాసామ్రాజ్య సింహాసనాన్నే ధిక్కరిస్తారు. అప్పుడు ఆ మహాసామ్రాజ్యంలోనే అందరికంటే శ్రీమంతుడైన మార్కస్‌ క్రాసిస్‌ అనేవాడు లక్షమంది రోమ్‌ సైనికుల్ని వెంటేసుకొని వేటకు బయల్దేరు తాడు. బానిస నేతల్ని శిలువేస్తాడు. తన వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటాడు.

శ్రమదోపిడీ నుంచి విముక్తి పొందాలని కార్మికుడూ, కర్షకుడూ కోరుకోవడం సహజం. తన కాయాన్ని పిండగా కారిన స్వేదానికి గిట్టుబాటు ధర కోసం ఆరాటపడతాడు. అవసరమైతే పోరాటానికి సిద్ధపడతాడు. ప్యారిస్‌ కమ్యూన్‌లను సృష్టించు కుంటాడు. అప్పుడు ఫ్రెంచ్‌ భూస్వాములు, ధనస్వాముల తరఫున ఒక ఫ్రెంచి ‘జాతీయ’ సైన్యం వేటకు బయల్దేరుతుంది. పొత్తిళ్లలో ఉన్న కమ్యూన్‌ శిశువును పీక నులిమి చంపేస్తుంది.

ఇప్పుడు అమృతోత్సవ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఇదే కథను చెబుతుంది. దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల పాలనలో నైజాం గ్రామసీమలు శుష్కించిపోతాయి. కూలీనాలీ బక్కజనం వెట్టి చాకిరీ, దౌర్జన్యాల కింద నలిగిపోతారు. పేద రైతులు పండించిన పంటనంతా లెవీ కింద లెక్కచెప్పి పస్తుల్ని ఆశ్రయిస్తుంటారు. వారి గుండె మంటలకు కమ్యూనిస్టుల ఆజ్యం తోడవుతుంది. బడుగులే పిడుగులవుతారు. బందూకులందుకొని తిరగబడ తారు. దొరలు, పెత్తందార్లు పారిపోతారు. మూడువేల గ్రామాల్లో పేదల ‘స్వరాజ్యం’ ఏర్పడుతుంది. పది లక్షల ఎకరాల భూమిని పంచుకుంటారు. ఉమ్మడి వ్యవసాయానికి సన్నాహాలు చేసుకుంటారు.
అదే సమయంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయడానికి యూనియన్‌ సైన్యం బయల్దేరుతుంది. నవాబు సహకారంతో నాలుగు రోజుల్లోనే విలీన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు యూనియన్‌ సైన్యాలు తెలంగాణ పల్లెల్లోనే తిష్ఠవేస్తాయి. పారి పోయిన దొరల్ని పునఃప్రతిష్ఠాపన చేస్తాయి. ఆక్రమించుకున్న భూముల్ని దొరలకు అప్పగిస్తాయి. అన్యాయానికి గురవుతున్న వారు చైతన్యవంతులవుతున్న ప్రతి సందర్భంలో ఆధిపత్య పెత్తందార్లు దాడులకు దిగారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారీ ఓడినా, గెలిచినా సరే బలహీనవర్గాలు బలం పుంజుకుంటూ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా కనీస ప్రజాస్వామిక హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ధనస్వామ్యం రూపు మార్చుకున్నదంతే! స్వభావాన్ని మార్చుకోలేదు.

రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేదవర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యాయానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ నిరూపించింది.

టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసి నప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్‌ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్‌ ఎనాలసిస్‌ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలిపోతుందంటాడు ఆ ప్రొఫెసర్‌!

చంద్రబాబు ప్రసంగాల్లో ఊకదంపుడు, శుష్కప్రియాలు తప్ప ఏమీ ఉండవనీ, ప్రసంగ పాఠాల్లో నిజాయితీతో కూడిన ప్రమాణాలను పాటించడం కానీ, చెప్పే విషయానికి సరైన ఆధారాలను జోడించడం కానీ చాలా అరుదనీ ఆయన అభిప్రాయం. వైఎస్‌ జగన్‌ ప్రసంగాలు ఇందుకు భిన్నంగా విశ్వసనీయత ప్రస్ఫుటమయ్యే విధంగా ఉంటాయని చెప్పు కొచ్చారు. తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా సూటిగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పారదర్శకత, వికేంద్రీకరణలతో ఏర్పాటు చేసుకున్న పాలనా వ్యవస్థ ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. 

‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతా’ లంటాడు తిలక్‌. తరతరాలుగా కష్టాలతో, నష్టాలతో, బరువు లతో, బాధ్యతలతో కునారిల్లిపోతున్న జనావళి కన్నీళ్లను దూరం చేయడానికి తన ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లా ఉపయోగ పడుతున్నాయో జగన్‌ వివరించారు. కన్నీటితో కడిగిన ప్రతి అక్షరం పునీతమవుతుంది. అందుకే జగన్‌ ప్రసంగాలకు జనంలో అంత విశ్వసనీయత, విలువ! తాను మూడు రాజధా నులు కావాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆయన చెప్పారు. అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకం కానే కాదని, ఇక్కడి అభివృద్ధిని కూడా ప్రాణప్రదంగా కాంక్షిస్తున్నానని చెప్పారు. విజయవాడ – గుంటూరు నగరాల అభివృద్ధిని కూడా చంద్రబాబు ఎంత నిర్లక్ష్యం చేశారనేది ఎత్తిచూపారు. తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్టచతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్‌డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగిందనీ ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్టచతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ.

విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్‌ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్‌ లేబర్‌ దొరకదనే భయం. మహిళలకూ, బలహీనవర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధి పత్యం దెబ్బతింటుందన్న భయం.

అసెంబ్లీలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినట్టు ఈ ఎల్లో పెత్తందార్లు, వారి బినామీలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ద్వారా కొనుగోలు చేసిన భూముల దగ్గరే రాజధాని రావాలి. ఈ పెత్తందార్లు నడిపే పత్రికల్నే ప్రజలంతా చదవాలి. వాళ్లు నడిపే చిట్‌ఫండ్‌ కంపెనీల్లోనే జనం చిట్టీలు కట్టాలి. వాళ్ల పాల డెయిరీలే ఉండాలి. వాళ్లే సినిమాలు తీయాలి. వాళ్లే పరిశ్రమలు పెట్టాలి. మార్కెట్‌లో ఇంకొకడు పోటీ ఉండొద్దు. ఇంకొకడు బాగా బతకొద్దు. ఈ దురహంకార పోకడకూ, ఈ స్వార్థ చింతనకూ జగన్‌ పరిపాలనలో ముకుతాడు పడుతుందనే ఆందోళనతో పెత్తందార్లు అల్లాడుతున్నారు. మూడేళ్లుగా దుర్మార్గమైన విష ప్రచారాన్ని కురిపించినా జగన్‌ ప్రభుత్వం చెక్కుచెదరలేదు. పైపెచ్చు తల ఎత్తుకొని నిలబడింది. రాష్ట్ర పురోగతిని తల ఎత్తుకునేలా నిలబెట్టగలిగింది. ఆదాయంలో సింహభాగాన్ని సమకూర్చగల మహానగరం లేకపోయినా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెండు లక్షలు దాటిందని తాజా అంచనా. ప్రచారాలతో పని జరగడం లేదని ఇప్పుడు మారీచుడు మాయలేడి వేషం ధరించాడు. ఒక మాయా ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వీయ రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజ నాన్ని రైతాంగ ప్రయోజనంగా చిత్రిస్తున్నారు. రకరకాల వ్యక్తుల నుంచి, శక్తుల నుంచి, వ్యవస్థల నుంచి, సంస్థల నుంచి మద్దతును చదివించుకొంటున్నారు. దివాళా తీసిన రెండు మూడు పార్టీలను పెద్ద ముత్తయిదువులుగా పేరంటానికి పిలిచి పోరాటం బొట్లు పెట్టారు. ఈ పోరాటం వెనకున్న ఆరాటంపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉన్నది.

రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేద వర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యా యానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ నిరూపించింది.

టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్‌ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్‌ జగన్‌ ముఖ్య మంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్‌ ఎనాలసిస్‌ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలి పోతుందంటాడు ఆ ప్రొఫెసర్‌!

ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్ట చతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్‌డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగిందనీ ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్ట చతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ.

విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్‌ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్‌ లేబర్‌ దొరకదనే భయం. మహిళలకూ, బలహీన వర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుందన్న భయం.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు