క్రీడల్లో మౌలిక విజయాలకు మోదీ దన్ను

20 Aug, 2021 00:30 IST|Sakshi

మన ప్రధానమంత్రి నీరజ్‌ చోప్రాకు లడ్డూ రుచిచూపించడం, పి.వి.సింధు కోసం ఐస్‌ క్రీమ్‌ తెప్పించడం, బజ్‌రంగ్‌ పూనియాను చిరునవ్వుతో పలకరించడం, సదా నవ్వుతూ ఉండాలని రవి దహియాకు ఆప్యాయంగా సూచించడం, మీరాబాయి చాను అనుభవాలను పంచుకోవడం వంటి దృశ్యాలన్నీ చూసిన ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు విరబూశాయి. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తోనూ ఆయన కాసేపు ముచ్చటించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ మరునాడు పారాలింపిక్‌ క్రీడాకారులతోనూ మాటామంతీ నిర్వహించి వారి స్ఫూర్తిదాయక క్రీడా పయనం గురించి తెలుసుకున్నారు. భారత క్రీడాకారుల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోగల వ్యక్తి కూడా ప్రధానిలో కనిపిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందే అక్కడ మన క్రీడాకారుల సంసిద్ధతపై నరేంద్ర మోదీ విస్తృత స్థాయి సమీక్ష నిర్వ హించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన క్రీడా మహా కుంభమేళాను ప్రారంభించారు. దీంతో అప్పటి దాకా క్రీడాంగణంలో చారిత్రక నైపుణ్యం అంతగా కానరాని ఆ రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచీ క్రీడాస్ఫూర్తి పెల్లుబికింది. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్స హించడంలో నరేంద్ర మోదీకి తనదంటూ ఒక పద్ధతి ఉంది.

కొన్ని రోజుల కిందట 2013 నాటి ఒక వీడియో విస్తృత ప్రాచు ర్యంలోకి వచ్చింది. అది పుణెలో కొందరు కళాశాల విద్యార్థులను ద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న వీడియో. ప్రతిభగల భారీ జనాభాతోపాటు భారతదేశానికి ఉజ్వల క్రీడాచరిత్ర ఉన్నప్పటికీ ప్రతి ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచుకోవడానికి పెనుగులాడాల్సి రావడం శోచనీయమని తన ప్రసంగంలో ఆయన ఎంతో వేదన వ్యక్తం చేశారు. భారత్‌ వంటి దేశం ఒలింపిక్స్‌ విజయాలు పొందలేకపోవ డానికి సమస్య క్రీడాకారుల పరమైనది కాదని... వారికి సముచిత ప్రోత్సాహ కల్పనలో వ్యవస్థ వైఫల్యమే కారణమని తనకు అర్థమైంద న్నారు. క్రీడలకు తగిన మద్దతు, గౌరవం లభించాల్సి ఉందని అభిప్రా యపడ్డారు. ఈ నేపథ్యంలో తమ ఓటమి సందర్భంగా ప్రధాని స్వయంగా సంభాషించడమే తమ నైతిక స్థైర్యం ఇనుమడించడంలో కీలకపాత్ర పోషించిందని పురుషుల, మహిళల హాకీ జట్లు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. 

ఇక క్రీడల విషయానికొస్తే– క్రీడల్లో పాల్గొనడానికి... ఆ దిశగా యువతకు లభించే ప్రోత్సాహానికీ మధ్య విస్తృత అగాథం ఉందని గుర్తించారు. ఒలింపిక్స్‌ విజేతలతో విందు సమావేశం అనంతరం మాట్లాడుతూ– ‘‘క్రీడలలో మనవాళ్ల ఇటీవలి విజయాలను చూశాక ఆటలపై తల్లిదండ్రుల ధోరణిలో సానుకూల మార్పు తప్పక వస్తుం దన్న విశ్వాసం కలిగింది’’ అన్నారు. ఈ క్రీడలలో భారత పతకాల సంఖ్య పెరగడం చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలవైపు ప్రోత్సహిస్తారన్న ఆశలు ప్రధాని వ్యాఖ్యతో మరింత పెరిగాయి. భారత క్రీడా విజయాలను మరింత పెంచడానికిగల పలు మార్గాల్లో ‘‘ఒక రాష్ట్రం – ఒక క్రీడ’’ దృక్పథంతో రాష్ట్రాలను ప్రోత్సహించడం కూడా ఒకటి. ఆ మేరకు ఏదైనా ఒకటి లేదా (ఇతర క్రీడలు నిర్లక్ష్యానికి గురికాకుండా) కొన్ని క్రీడలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వవచ్చు. తమ పరిధిలోగల ప్రతిభా నిధి, సహజ ఆసక్తి, వాతా వరణ పరిస్థితులు సహా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల లభ్యత ఆధారంగానూ ఒక నిర్ణయం తీసుకోవచ్చు.  

భారత క్రీడారంగ ప్రగతికి దోహదపడిన అంశాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణా లకు పెద్దపీట వేయడం మరొకటి. ఈ దిశగా సంప్రదాయక మార్గం అధికార యంత్రాంగం ప్రమేయంతో కూడుకు న్నదే కాకుండా ప్రయాస కూడా అధికం. కానీ, మోదీ ప్రభుత్వంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపో యింది. ఆ మేరకు క్రీడాకారుల నుంచి సాక్షాత్తూ ప్రధానమంత్రే నేరుగా సమాచారం స్వీకరించడానికి ప్రాధాన్యమిచ్చారు. తదను గుణంగా క్రీడా మౌలిక వసతుల బలోపేతానికి గల వివిధ మార్గాలపై వారి అభిప్రాయాలను తనతో పంచుకోవాలని టోక్యో–2020కి వెళ్లే క్రీడాకారుల బృందాన్ని ఆయన కోరారు. ఇక మీరాబాయి కావచ్చు... మేరీకోమ్‌ కావచ్చు... క్రీడాకారులు ఎవరైనప్పటికీ గాయాలపాలై నపుడు వారికి మోదీ అత్యుత్తమ చికిత్స లభించేలా చూశారు.


అనురాగ్‌ ఠాకూర్‌ 

భారత క్రీడారంగంపై ప్రతికూల ప్రభావం చూపిన ఇతర అంశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వికాసం కూడా ఒకటి. ఈ విషయాన్ని మోదీ తన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ (పరీక్షల యోధులు) పుస్తకంలోనే కాకుండా ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమాల సందర్భం గానూ ప్రస్తావించారు. ఆ మేరకు ‘ప్లే స్టేషన్‌’ (ఆధునిక క్రీడాపరి కరం)తో సమానంగా ‘ప్లేయింగ్‌ ఫీల్డ్‌’ (క్రీడా మైదానం)కూ ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు క్రీడలలో మానవ ప్రమేయం– జట్టు తత్వం, కలివిడితనంతో కూడిన ఆరోగ్యకర సమతూకం అవసరమని ఉద్బో« దించారు. రాబోయే కాలంలో భారతదేశపు తొలి క్రీడా విశ్వవిద్యా లయం మణిపూర్‌లో సాకారం కానుంది. ఇది క్రీడాకారులకు ఒక వరం మాత్రమే గాక ముఖ్యంగా ఈశాన్య భారతంలోని సుసంపన్న క్రీడా వారసత్వాన్ని ప్రోదిచేసేందుకు ఉపయోగపడుతుంది.
టోక్యో–2020 భారత్‌ అనేక తొలి ఘనతలు సాధించిన ఒలిం పిక్స్‌. అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి స్వర్ణపతకం మన వశమైంది. హాకీ జట్టు అద్భుతాలు చేసింది... డిస్కస్‌ త్రో, గోల్ఫ్, కత్తి యుద్ధం వగైరా క్రీడల్లోనూ మనవాళ్లు విజయవంతమయ్యారు. మొత్తంమీద నవభార తంలో నేడు ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది... మన క్రీడలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. క్రీడల్లో రాణించా లని ఆరాటపడే క్రీడాకారులకు మన ప్రధాని సదా అండగా నిలుస్తారు. వ్యాసకర్త కేంద్ర సమాచార–ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖల మంత్రి 

>
మరిన్ని వార్తలు