ప్రభుత్వంలో 5,897.. ప్రైవేట్‌లో 2,596

7 Aug, 2020 04:26 IST|Sakshi

బెడ్స్‌ సంఖ్య వెల్లడించిన వైద్య ఆరోగ్యశాఖ

ఒకే రోజు 2,092 కేసులు,13 మరణాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 8,493 పడకలు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5,897, ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 2,596 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం బులెటిన్‌ విడుదల చేశారు. ఆక్సిజన్‌ పడకలు 2,510 ఉండగా, 837 ఖాళీగా ఉన్నాయి. ఇక ఐసీయూ పడకలు 1,307 ఉండగా, వాటిల్లో 536 ఖాళీగా ఉన్నాయని తెలిపారు.  

ఒకే రోజు 2,092 కేసులు: రాష్ట్రంలో బుధవారం (5వ తేదీ) 2,092 కరోనా కేసులు నమోదయ్యా యి. మొత్తం బాధితుల సంఖ్య 73,050కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 589కి చేరింది. కరోనా బారినుంచి కోలుకుని 1,289 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి సంఖ్య 52,103కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 5,43,489కి చేరింది.

బుధవారం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇంకా 1,550 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తా జాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 535 కేసులు ఉన్నాయి. రంగారెడ్డిలో 169, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 126, కరీంనగర్‌లో 123, వరంగల్‌ అర్బన్‌లో 128, సంగారెడ్డి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో పావు శాతం మంది 31–40 ఏళ్ల మధ్య వయస్కులేనని బులెటిన్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు