బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి : కేంద్ర మంత్రి

20 Nov, 2020 09:58 IST|Sakshi

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి : కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటి అనుచిత విధానాలను అరికట్టవచ్చవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుపరమైన ఆదాయాలు కూడా లభించవచ్చన్నారు. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) పార్ట్‌టైమ్‌ సభ్యుడు నీలేష్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్‌ ఈ మేరకు స్పందించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాలు దీన్ని చట్టబద్ధం చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీన్ని క్రీడలు లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని మంత్రి చెప్పారు. బెట్టింగ్‌ అన్నది వ్యవస్థాత్మకమైనదని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడే వారిని గుర్తించేందుకు దీన్ని ఉపయోగించు కోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా