ఉద్యానానికి ఉపాధి ఊతం

27 Mar, 2023 00:40 IST|Sakshi
ఉపాధి హామీ పథకం ద్వారా సాగవుతున్న ఉద్యాన పంటలు

ఏలూరు(మెట్రో) : అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటలో నూ రైతులకు మేలు జరిగేలా సంకల్పించింది. దీని లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటల సాగుకు జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీ సుకుంది. ఉమ్మడి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఉ ద్యాన పంటల సాగు ఉండగా ‘ఉపాధి’ పథకం ద్వా రా ప్రోత్సాహం అందించేలా సన్నాహాలు చేస్తోంది.

ఐదెకరాల్లోపు..

ఉపాధి హామీ పథకం ద్వారా అరెకరం నుంచి ఐదు ఎకరాలలోపు భూములున్న రైతుల నుంచి డ్రై ల్యాండ్‌ హార్టీకల్చర్‌ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వచ్చేనెల 1వ తేదీ నుంచి మొదలు కానున్న ఈ పథకం ద్వారా పండ్ల తోటలు, పూలసాగుకు చర్యలు తీసుకుని రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న పండ్ల తోటల్లోనూ అంతర్‌ పంటలు సాగు చేసుకునేలా వెసులుబాటు కల్పించనుంది.

పంట చేతికి వచ్చే వరకూ..

ఉపాధి హామీ పథకం ద్వారా సాగు చేసే పంటలు చేతికి వచ్చే వరకూ ప్రభుత్వం సాయం అందిస్తుంది. రైతు దుక్కి దున్నేందుకు, కందకాలు తీసుకునేందు కు, మొక్కల కొనుగోలు, నాటడం వంటి పనులకు తోడ్పాటు అందిస్తుంది. అంతర్‌ పంటలుగా పూల సాగు చేస్తే ఏడాది పొడవునా రైతుకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటోంది.

ఎకరాకు రూ.లక్ష

ఉపాధి హామీ డ్రైల్యాండ్‌ హార్టీకల్చర్‌లో భాగంగా నేల స్వభావాన్ని బట్టి రైతులకు మామిడి, చీని, ని మ్మ, దానిమ్మ, జామ, తైవాన్‌ జామ, సపోటా, చింత, నేరేడు, కొబ్బరి, సీతాఫలం, యాపిల్‌బేర్‌, డ్రాగన్‌ఫ్రూట్‌, గులాబీ, మల్లె, మునగ పంటల సాగు కోసం రైతు నుంచి దరఖాస్తులు ఆహ్వానించ నున్నారు. గుంతలు తవ్వే దగ్గర నుంచి మొక్కలతో పాటు పురుగు మందుల వరకు సుమారు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రభుత్వం వెచ్చించనుంది. దీంతో పాటు అదనంగా మూడేళ్లపాటు మొక్కలకు నీటిని సైతం పెట్టి సంరక్షించేందుకు రైతుకు బిల్లులు అందిస్తారు.

డ్రైల్యాండ్‌ హార్టీకల్చర్‌ పథకం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలు

అడిగిన వారందరికీ అందించేలా చర్యలు

వచ్చేనెల నుంచి దరఖాస్తుల స్వీకరణ

మే నెలలో కందకాల తవ్వకాలు

రైతులను ప్రోత్సహించేలా..

రైతులను ప్రోత్సహించేందుకు, ఖర్చు లేకుండా ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపాధి హామీ పథకం ద్వారా అడిగిన ప్రతిఒక్క రైతుకు డ్రైల్యాండ్‌ హార్టీకల్చర్‌ ద్వారా ఉద్యాన పంటలు పండించేలా చర్యలు తీసుకుంది. వచ్చేనెల మొదటి వారం నుంచి రైతులు ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అరెకరం నుంచి ఐదెకరాల వరకు ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చు.

– డి.రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు జిల్లా

మరింత మందికి మేలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉ పాధి హామీ పథకం ద్వారా ఉద్యా న పంటలకు తోడ్పాటు అందిస్తోంది. జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాలకు పైబడి ఉద్యాన పంటలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా మరింత మంది రైతులను ప్రోత్సహించడం ద్వారా వేలాది ఎక రాల ఉద్యాన పంటలు సాగయ్యే అవకాశం ఉంది.

– పీవీఎస్‌ రవికుమార్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఏలూరు జిల్లా

మరిన్ని వార్తలు