మహిళా సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యం

27 Mar, 2023 00:40 IST|Sakshi
తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌ ఆసరా చెక్కు అందిస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం అర్బన్‌: రాష్ట్రంలో మహిళా సాధికారత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నా రు. స్థానిక మాగంటి కల్యాణ మండపంలో ఆదివారం వైఎస్సార్‌ ఆసరా మూడో విడత కార్యక్రమా న్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 1,036 డ్వాక్రా సంఘా ల్లోని 9,430 మంది మహిళలకు రూ.8,00,31,277 చెక్కు అందజేశామన్నారు. 2014కు ముందు చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండగా చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి అటువైపు వెళ్లలేదన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.10 కోట్లు ఆఫర్‌ చేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థిక సమృద్ధి సాధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 31.60 లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానిదే అన్నారు. సీఎం జగన్‌ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అనంతరం సీఎం జగన్‌, మంత్రి కొట్టు చిత్రాపటాలకు డ్వాక్రా మహిళలు క్షీరాభిషేకం చేశారు.

ఆర్డీఓ దాసి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ బి.బాలస్వామి, మున్సిపల్‌ ఇంజినీర్‌ మురళీకృష్ణ, నాయకులు సంపత్‌కుమార్‌, కొలుకూరి ధర్మరాజు, వెలనాటి సత్తిబాబు, తాళ్లూరి మురళి, బోళెం రమణ, బొద్దాని శ్రీనివాసు, బోళెం రామలక్ష్మి, బోణం విజయనిర్మల, కర్రి సుధాకర్‌రెడ్డి, చింతా శ్రీనివాసు, సంపత్‌రావు కృష్ణారావు, రాజా త్రినాథ్‌, మానికొండ వెంకటేశ్వరరావు, చామన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

మరిన్ని వార్తలు