‘ఫ్యామిలీ డాక్టర్‌’కు కొత్త వాహనాలు

27 Mar, 2023 00:40 IST|Sakshi
జిల్లాకు మంజూరైన 104 వాహనాలు

ఏలూరు టౌన్‌: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం విజయవంతం కావడంతో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాకు 16 కొత్త 104 వాహనాలు మంజూరు చేశారు. ఇప్పటికే జిల్లాలో 28 సంచార వైద్యశాల వాహనాలు ఉండగా తాజాగా 16 కొత్త వాహనాలతో ఆ సంఖ్య 44కు చేరింది. జిల్లావ్యాప్తంగా ఒక్కో గ్రామానికి రెండుసార్లు సంచార వైద్యశాల వాహనం వెళుతుండగా, కొత్త వాహనాల చేరికతో మరిన్ని సేవలందనున్నాయి.

నియోజకవర్గాల వారీగా కేటాయింపు

ఏలూరు నగరానికి సంబంధించి ఒకటి, దెందులూ రు నియోజకవర్గంలో పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాలకు మూడు, కై కలూరు నియోజకవర్గంలోని కలిదిండి, ముదినేపల్లి, కై కలూరు మండలాలకు మూడు, చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం, చింతలపూడి మండలాలకు రెండు, ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం, ఉంగుటూరు మండలాలకు రెండు, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాలకు రెండు, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలానికి ఒకటి, పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలానికి ఒకటి చొప్పున వాహనాలను కేటాయించారు. అత్యవసర సమయాల్లో వినియోగించేలా ఒక వాహనాన్ని అదనంగా కేటాయించారు.

జిల్లాకు 16 వాహనాల మంజూరు

నేడు లాంఛనంగా ప్రారంభం

మరింత సమర్థవంతంగా..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లోని పేదలకు మేలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలనే తపనతో ఫ్యామిలీ డాక్టర్‌ (ఫిజీషియన్‌) విధానం అమల్లోకి తెచ్చారు. ఇప్పటివరకూ జిల్లాలో 28 వాహనాలు ఉండగా, కొత్తగా మరో 16 వాహనాలు మంజూరయ్యాయి. సోమవారం కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ వీటిని లాంఛనంగా ప్రారంభిస్తారు.

–డాక్టర్‌ ఆశ, డీఎంహెచ్‌ఓ, ఏలూరు

మరిన్ని వార్తలు