శ్రీవారి క్షేత్రం.. భక్తజన సాగరం

27 Mar, 2023 00:40 IST|Sakshi
జంట గోపురాల వద్ద భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్‌ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అన్నప్రసాదం కోసం నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులు బారులుతీరారు. క్షేత్రంలో సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. ఆల య అనివేటి మండపంలో తిరుమ తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన శ్రీ వీరభద్ర కోలాట భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు అలరించాయి.

ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు

దెందులూరు: వేగవరం హేలాపురి ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో జేఎన్‌టీయూ సెంట్రల్‌ జోన్‌ క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల జట్టుపై నరసారావుపేట ఇంజనీరింగ్‌ కళాశాల జట్టు, డీఎన్నార్‌ కళాశాల జట్టుపై కిట్స్‌ మార్కాపురం కళాశాల జట్టు విజయం సాధించాయి. అలాగే హేలాపురి కళాశాల జట్టుపై వీఆర్‌ సిద్ధార్థ కళాశాల జట్టు, కై ట్‌ కళాశాల జట్టుపై ఆదిత్య కళాశాల జట్టు, గోదావరి కళాశాల జట్టుపై కేకేఆర్‌ కేఎస్‌ఆర్‌ కళాశాల జట్టు గెలుపొందాయి. ముందుగా క్రీడాకారులను కళాశాల రిప్రజంటేటివ్‌ సమీర్‌, ఏఓ కరుణానిధి, ప్రిన్సిపాల్‌ రాధాకృష్ణ పరిచయం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు