పాత్ర ఏదైనా.. మెచ్చేలా నటన

27 Mar, 2023 00:40 IST|Sakshi
సుందరకాండ నాటికలో మాదిరెడ్డి శ్రీనివాసరావు (కోటు వేసుకున్న వ్యక్తి)

పాలకొల్లు అర్బన్‌: క్షీరపురి కళారంగానికి ప్రసిద్ధి. చిత్ర పరిశ్రమలోని 24 అంశాల్లోనూ పాలకొల్లు కళాకారుడి పాత్ర వెండి తెరపై వెలుగుతూనే ఉంది. హాస్యనటులు అల్లు రామలింగయ్య, దర్శకరత్న దాసరి నారాయణరావు ఆ స్థాయికి చేరుకోవడానికి మాతృకం రంగస్థలమే. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నటీనట సమాఖ్య ఆధ్వర్యంలో రంగస్థలానికి సేవలందిస్తున్న ఇద్దరు కళాకారులను సోమవారం స్థానిక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో సత్కరించనున్నారు. వీరిలో ఒకరు మాదిరెడ్డి శ్రీనివాసరావు కాగా, మరోకరు జాగు సత్యనారాయణ. వీరు ఓ వైపు సర్కారు ఉద్యోగం చేస్తూనే మరో వైపు కళారంగంపై అభిమానంతో రంగస్థలిపై ఎన్నో ఏళ్లుగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ కళాకారులు రంగస్థలానికి అందించిన సేవలను ఓ సారి మననం చేసుకుందాం.

వృత్తి సర్కారు కొలువు.. ప్రవృత్తి నాటక రంగం

కళాకారులు మాదిరెడ్డి, జాగుల నట ప్రస్థానం

నటీ నట సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నేడు పాలకొల్లులో సత్కారం

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

మరిన్ని వార్తలు