విలన్‌ పాత్రల్లో ఒదిగిపోతూ..

27 Mar, 2023 00:40 IST|Sakshi
నాన్నా నన్ను క్షమించకండి నాటికలో హీరో తండ్రి వేషంలో జాగు

పాలకొల్లుకు చెందిన జాగు సత్యనారాయణ తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. 1973లో ఎంఎంఎకేఎన్‌ మునిసిపల్‌ హైస్కూల్‌లో పది నిమిషాల నాటిక ప్రదర్శన ద్వారా ఆయన తొలిసారి ముఖానికి రంగు పూసుకున్నారు. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ రచించిన రథ చక్రాలు నాటికలో, సింహాద్రి అప్పన్న కొండ దిగిరా నాటకంలో విలన్‌ పాత్రలను చాలా పరిషత్‌లలో ప్రదర్శించి ఉత్తమ విలన్‌గా గుర్తింపు పొందారు. డిగ్రీ చదివే రోజుల్లో కత్తుల రామమోహన్‌, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, నూలి సత్యనారాయణ, ముత్తిరెడ్డి సూర్యారావు, గండేటి వెంకటేశ్వరరావులతో కలిసి త్రివేణి, మంచం మీద మనిషి, రథ చక్రాలు నాటికలు ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతూ 1979లో తొలిసారిగా స్టేజి డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 1981లో ఆంధ్రాబ్యాంక్‌లో ఉ ద్యోగంలో చేరి 37 ఏళ్లు పనిచేసి అసి స్టెంట్‌ మేనేజర్‌గా 2016లో ఉద్యోగ విర మణ చేశారు. నాటకంపై మక్కువతో ప్ర ముఖ సోషల్‌ వర్కర్‌ జాన నాగేశ్వరరావు స్థాపించిన నటరాజ కళానిలయం బ్యానర్‌లో దశాబ్దం పాటు ఏడవకండి ఏడవకండి, వర్ణమేథం నాటికలు ప్రదర్శించారు. బళ్ల రాఘవ దర్శకత్వంలో సింహాద్రి అప్పన్న కొండ దిగిరా నాటకంలో విలన్‌ పాత్ర చేసి ప్రసంశలు పొందారు. నేషనల్‌ బ్యాంక్‌ కన్వెన్షన్‌లో స్కిట్స్‌ ప్రదర్శించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.

మరిన్ని వార్తలు