పాత్రలకు జీవం పోస్తూ..

27 Mar, 2023 00:40 IST|Sakshi
దిష్టిబొమ్మలు నాటికలో న్యాయవాది పాత్రలో మాదిరెడ్డి శ్రీనివాసరావు

భీమవరానికి చెందిన మాదిరెడ్డి శ్రీనివాసరావు.. నరసాపురం జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కులాల కురుక్షేత్రం, దోచుకోలేనంత ప్రేమ, ఉమెన్‌ ఇండిపెండెన్స్‌ డే, సాక్ష్యం, సినీ భారతం, మిస్సింగ్‌, ప్రేమతో, కలియుగ పంచ పాండవులు, అనుకున్నది ఒక్కటి అయినది ఇంకోకటి, మానవత, పురోహితుడు, చూడచక్కని చిత్రం, కథనం తదితర షార్ట్‌ ఫిల్మ్‌లో పలు పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ నాటిక రచయిత తాళాబత్తుల వెంకటేశ్వరరావు రచించిన ‘నాన్నా నన్ను క్షమించకండి’ నాటికను శ్రీకాకుళం పరిషత్‌ పోటీల్లో ప్రదర్శించి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ చేతుల మీదుగా ప్రత్యేక బహుమతి పొందారు. అలాగే దిష్టిబొమ్మలు నాటికలో న్యాయవాదిగా రాష్ట్రంలోని అన్ని పరిషత్‌లో ప్రదర్శించారు. బీవీఆర్‌ కళాకేంద్రం, తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో నవవసంతం, సరస్వతి నమస్తుభ్యం, తస్మాత్‌ జాగ్రత్త, అల్లూరి సీతారామరాజు నాటకంలో అగ్గిరాజుగా, మళ్లీ మరో జన్మంటూ ఉంటే నాటికలో కోయంబత్తూర్‌ గణేష్‌గా, అంబేడ్కర్‌ నాటకంలో మరాఠీ రచయిత కేలూస్కర్‌గా, తప్పు ఎవరిది నాటిక, నాన్నా నన్ను క్షమించకండిలో ఎస్సైగా, బంధాలు బరువెంత నాటికలో హీరోగా, గుర్రం జాషువా నాటికలో జాషువా తండ్రిగా, బీబీ నాంచారి నాటికలో మత ప్రవక్తగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మరిన్ని వార్తలు