యువ దర్శకుడితో తళపతి తదుపరి చిత్రం

11 Dec, 2020 07:26 IST|Sakshi

చెన్నె : కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ తళపతి విజయ్‌ నటించనున్న 65 వ చిత్రానికి దర్శకుడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’తో హిట్‌ కొట్టిన దర్శకుడు నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో విజయ్‌ జోడిగా నయనతార నటించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కె చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ బాణీలు సమకుర్చనున్నాడు.
కాగా చిత్ర దర్శకుడు నెల్సన్‌ సినిమాకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నా తదుపరి చిత్రం విజయ్‌తో చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ర్‌గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం 2021 సంక్రాతికి విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు