Anand Mahindra Review On 12th Fail: ‘ఇంకా కావాలయ్యా...!’ ఆనంద్‌ మహీంద్రా ఇంట్రస్టింగ్‌ మూవీ రివ్యూ

18 Jan, 2024 17:40 IST|Sakshi

ఇటీవల రిలీజై చర్చల్లో నిలిచి, వసూళ్లలో దూసుకుపోతున్న బాలీవుడ్‌ మూవీ 12th ఫెయిల్‌. బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikranth Massey) న‌టించిన‌  12th ఫెయిల్ ఓటీటీలో తెలుగు సహా పలు భాషలలో అందుబాటులో ఉంది. మంచి కథా కథనం,  స్ఫూర్తిదాయకంగా  కూడా ఉండటంతో నెటిజన్లుతోపాటు, పలువురు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజా ప్రముఖ వ్యాపారవేత్త ,ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర కూడా స్పందించారు. అంతేకాదు ఆనంద్‌ మహీంద్ర సినిమా రివ్యూలు కూడా ఇంతబాగా చేయగలరా అంటూ నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు.
 
ఎపుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సైన్స్‌, క్రీడలు, ఇలా  అనేక ఆసక్తికర  ట్వీట్లు  చేసే ఆయన  ఒక  మూవీ గురించి  సానుకూలంగా స్పందించడం విశేషంగా నిలిచింది. అంతేకాదు  దేశంలోని నిజ జీవిత హీరోల ఆధారంగా రూపొందిన ఈ మూవీని అందరూ  చూడాలంటూ నెటిజనులకు  సూచించారు.   చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. 12th ఫెయిల్' ఆయనపై బలమైన ముద్ర వేసినట్లు అనిపిస్తుంది, ప్రత్యేకించి  నిజ-జీవిత హీరో థీమ్, ఆకట్టుకునే నటన కథనం వాటిపై తన రివ్యూ ఇతరులకు కూడా ఈ సినిమా కచ్చితంగా చూడండి అంటూ  రాసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకా కావాలయ్యా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఎట్టకేలకు గత వారాంతంలో 12th ఫెయిల్‌ సినిమా చూశాను. ఈ సంవత్సరంలో ఒకే ఒక్క సినిమాని చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూడండి అంటూ తన ఫాలోయర్లకు సూచించారు ఆనంద్‌ మహీంద్ర. ఎందుకు ఈ చిత్రాన్ని చూడమంటున్నారో కూడా మహీంద్రా తన ట్వీట్‌లో వివరించారు. కేవలం హీరో  మాత్రమే కాదు  విజయం కోసం ఆకలితో  అలమటించే లక్షలాది మంది యువత జీవితంలో  ఎదుర్కొనే కష్టాలతోపాటు,  అనేక అసమానతలు, సవాళ్ల మధ్య తను అనుకున్న పరీక్షల ఉత్తీర్ణత సాధించేందుకు పోరాడిన తీరును అభినందించారు.

12th ఫెయిల్ సినిమా  టాప్ 250ఘైఎండీబీ ర్యాంకింగ్‌లో సంచలనంగా మారింది. 10కి 9.2 రేటింగ్‌ను పొందింది.  షారూఖ్‌కాన్‌  డంకీ, సన్నీ డియోల్  గదర్, రణబీర్ కపూర్ యానిమల్  లాంటి   సినిమాలకు దీటుగా దూసుకుపోతోంది. 

కథలను ఎంచుకోవడంలో విధు వినోద్‌ చోప్రా గురించి  ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్టర్లు అందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్రలోనూ గంభీరమైన, ఉద్వేగభరితమైన నటన కనిపించిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా  విక్రాంత్ మాస్సే తన పాత్రకు జీవం పోశారు.  జాతీయ చలనచిత్ర అవార్డుకు అర్హమైన యాక్టింగ్‌ అది అని పేర్నొన్నారు.  ఇంటర్వ్యూ సీన్ (కల్పితంగా అనిపించినా) ఇదే  హైలైట్ అంటూ ఒక్కో అంశంపైనా ప్రశంసలు కురిపించారు. నవ భారతం కోసం  ఏం చేయాలో  మనకు పట్టిచ్చిన  సినిమా ఇది.. మిస్టర్ చోప్రా, యే దిల్ మాంగే  మోర్‌ అంటూ ట్వీట్‌ చేశారు.  దీనికి ఈ మూవీ నటుడు విక్రాంత్‌, నటి మేధా శంకర్‌,  విధు వినోద్‌ చోప్రా ఫిలింస్‌ ధన్యవాదాలు తెలిపారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌  వైరల్‌గా మారింది.

>
మరిన్ని వార్తలు