నాన్నకు ప్రేమతో...కూతురు

13 Feb, 2021 01:04 IST|Sakshi
తనిష్క

కరోనాతో కన్నుమూసిన తండ్రి కల నెరవేర్చడానికి 13 ఏళ్ల తనిష్క బిఎ ఎల్‌ఎల్‌బిలో చేరాలనుకుంది. అయితే, అందుకు పర్మిషన్‌ లభించకపోవడంతో బిఎ సైకాలజీలో చేరింది. 12 ఏళ్ల వయసులో ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, 11 ఏళ్ల వయసులో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఎనిమిదేళ్ల వరకు స్కూల్‌కు వెళ్లిన తనిష్క ఆ తర్వాత ఇంటి నుంచే చదువు కొనసాగించింది. చిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ తండ్రి కలను నెరవేర్చాలనుకుంటోంది తనిష్క.
  
 స్కూల్‌ ఏజ్‌లో డిగ్రీ స్థాయి చదువులతో బిజీగా ఉన్న తనిష్క మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఏరోడ్రోమ్‌ ప్రాంతంలో నివసిస్తోంది. 13 ఏళ్ల వయసు.

స్కూల్‌ చదువు కూడా పూర్తి కాని ఈ అమ్మాయి ఇప్పుడు బి.ఎ సైకాలజీ చేస్తోంది. తండ్రి కల నెరవేర్చాలనే లక్ష్యంగా బిఎ ఎల్‌ఎల్‌బి కోసం అనుమతి కోరింది. కానీ, చిన్న వయసు అనే కారణంగా ఇంకా అనుమతి లభించలేదు. దీంతో బిఎ సైకాలజీలో చేరింది. ఈ డిగ్రీ పూర్తి చేశాక, ఎల్‌ఎల్‌బి చేస్తానంటోంది తనిష్క.

మరిన్ని వార్తలు