Eye Health: స్మోకింగ్‌ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే..

12 Sep, 2021 09:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌ లేకుండా రోజు గడవటం కష్టమంటే అతిశయోక్తి కాదేమో! మన జీవన విధానంలో అవి అంతగా కలిసిపోయాయి మరి! అయితే దాని వెన్నంటే కంటి సమస్యలు కూడా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. యేటా దాదాపుగా 1 బిలియన్‌ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేధికలో వెల్లడించింది. అయితే పోషకాహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నూట్రీషనిస్ట్‌ రూపాలి దత్త సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం..

విటమిన్లు అధికంగా ఉండే అహారాన్ని తినాలి
శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమన్లు అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా? అమెరికన్‌ ఆప్టోమెట్రిక్‌ అసోసియేషన్‌ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్‌ డీజెనరేషన్‌ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అందువల్లనే నిపుణులు ఈ విటమిన్లు అధికంగ ఉండే సిట్రిక్‌ ఫలాలు, డ్రై నట్స్‌, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు.

ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు
ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. అకాడమీ ఆఫ్‌ నూట్రీషన్‌ అండ్‌ డైటిటిక్స్‌ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్‌, రేడియేషన్‌ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది.

మరింత నీరు తాగాలి
నీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలుసు. డీహైడ్రేషన్‌ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.

నియంత్రణలో శరీర బరువు
యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్‌ డ్యామ్‌ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్‌, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధిక బరువు కారణంగా కంటిలోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెల్పింది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచే ఆహారపు అలవాట్లవల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.

ధూమపానానికి దూరంగా
సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం స్మోకింగ్‌ అలవాటు కంటి చూపులో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్‌ చేసేవారిలో కాంటరాక్ట్‌ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఈ సూచలను పాటిస్తే మీ కంటి చూపు జీవితకాల‍ంపాటు పదిలంగా ఉంచుకోవచ్చని ప్రముఖ నూట్రీషనిస్ట్‌ రూపాలి దత్త సూచిస్తున్నారు.

చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే..

మరిన్ని వార్తలు