ఆ విషాదమే ఆమెని సక్సెస్‌ఫుల్‌ ఆగ్రో ఎంట్రెప్రెన్యూర్‌గా మార్చింది..ఏకంగా ఏడాదికి..!

23 Feb, 2024 17:14 IST|Sakshi

భర్త అకాల మరణం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఓ సక్సెస్‌ ఫుల్‌ ఆగ్రో ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. నేడు ఏకంగా ఏడాదికి 30 లక్షలు దాక ఆర్జిస్తోంది. పైగా ఎలాంటి ఉన్నత చదువులు చదువుకోకపోయినా కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తోంది. తాను నమ్ముకున్న భూమితల్లే తన విజయానికి కారణమని సగర్వంగా చెబుతోంది రాజ్‌బాల. ఎవరీ రాజ బాల? ఎలా అన్ని లక్షలు ఆర్జిస్తుందంటే..

రాజస్తాన్‌కి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు రాజ్‌బాల భర్త అకాల మరణంతో ఏం  చేయాలేని అగాధంలోకి వెళ్లిపోయింది. ఓ పక్క ఇద్దరు పిల్లలు వాళ్లను ఎలా సాకాలో తెలియని సందిగ్ధ స్థితి. ఇక లాభం లేదు తానే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంది.  తాను నమ్ముకున్న భూమినే ఆశ్రయించింది. అందరి రైతుల్లా కాకుండా రాజ్‌బాల సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యిపోయింది. అనుకున్నదే తడువుగా సేంద్రీయ పద్ధతిలో ఇంటికి సరిపడ కాయగూరలు తదితర వాటిని పెంచుకునేది. ఆ తర్వాత క్రమేణ ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులు మంచివని, కేన్యర్‌ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించే కూరగాయాలతోనే సాధ్యమని పలు అవగాహన కార్యక్రమల ద్వారా తెలుసుకుంది. 

మొదట్లో ఇంట్లోకి కావాల్సినంత మటికే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించిన ఆమె ఈ రోజు అందరి కోసం సేంద్రియ పద్ధతుల్లో చాలా కూరగాయాలు పండిచడం ప్రారంభించింది. ఇలా ఆమె తన పొలంలో బొప్పాయి, మామిడి, అల్లం, పసుపు, బీట్‌ రూట్‌, టమాటాలతో సహా వివిధ రకాల కూరగాయలను పండిస్తోంది. అక్కడితో రాజ్‌బాల ఆగిపోలేదు పప్పు ధన్యాలు, సుగంధాలు పండించడం నుంచి పశువులకు దాణ అందించడం వరకు అన్నింటిని పండించేది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి శ్రమనే అధికంగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

ఆమె వ్యవసాయ నైపుణ్యం చూసి ఇతరులు కూడా ఈ సేంద్రియ వ్యవసాయమే చేయడం విశేషం. తాను తన భర్త మరణంతోనే సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చానని, నేడు దీంతో ఏడాదికి రూ. 30 లక్షలు పైనే ఆర్జిస్తున్నానని సగర్వంగా చెబుతోంది. ఇంకా ఆమె తాను మంచి చదువులు చదువుకోకపోయిన పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే గాకుండా ఒకరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫిసర్‌గా, మరోకరు లండన్‌లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన కోడళ్లు మద్దతుతో సోషల్‌ మీడియా ద్వారా సేంద్రియ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అందులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు, సలహాలు సూచనలు కూడా ఇస్తోంది రాజ్‌ బాల.

(చదవండి: ఆత్మవిశ్వాసం గల పిల్లలుగా ఎదగాలంటే..ఆ తప్పులు చెయ్యొదంటున్న మిచెల్‌ ఒబామా!)

Election 2024

మరిన్ని వార్తలు