భన్సాలీ అభిమాన తార

13 Sep, 2020 08:05 IST|Sakshi

జెన్నిఫర్‌ వింగెట్‌.. ఈ పేరు విని  ఫారెనర్‌ అనుకొని ఆమెను చూశాక ‘ఓ ఇండియనే’ అని మొహమ్మీదే కామెంట్‌ చేసేవాళ్లు జెన్నిఫర్‌ ఎక్కడికి వెళ్లినా తారసపడ్తారట. ఆమె టీవీ, సినిమా, వెబ్‌ సిరీస్‌ నటి.  సంజయ్‌లీలా భన్సాలీ అభిమాన తార. 

  • పుట్టింది, పెరిగింది ముంబైలోనే. తల్లి ప్రభ. గృహిణి. తండ్రి హేమంత్‌ వింగెట్‌. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగి. ఆమెకు ఒక అన్న మోసెస్‌ వింగెట్‌. ఇదీ జెన్నిఫర్‌ కుటుంబం. బీకామ్‌ డిగ్రీ.. ఆమె అకడమిక్‌ సమాచారం. 
  • ‘అకేలే హమ్‌ అకేలే తుమ్‌’ సినిమాతో బాలనటిగా ఎంటర్‌ అయినా, నటిగా పరిచయమైంది మాత్రం ‘షకలక బుమ్‌ బుమ్‌’ టీవీ సీరియల్‌తో. తర్వాత ‘కుసుమ్‌’, ‘కసౌటీ జిందగీ కే’ వంటి సీరియళ్లతోనూ ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దిల్‌ మిల్‌ గయే’తో పాపులర్‌ అయింది. మనసుల్లో ముద్ర వేసింది మాత్రం సంజయ్‌లీలా భన్సాలీ ‘సరస్వతీచంద్ర’ సీరియల్‌లో కుముద్‌ పాత్రతో. 
  • ‘సరస్వతిచంద్ర’ లీడ్‌ రోల్‌ కోసం జెన్నిఫర్‌నే మొదట ఎంపిక చేసుకున్నప్పటికీ కాంట్రాక్ట్‌ కుదరక ఆమెను తప్పించాడు సంజయ్‌లీలా. చాలా మందిని వెదికి మళ్లీ జెన్నిఫర్‌నే తీసుకున్నాడు. ఆమె తప్ప ఆ రోల్‌కి ఇంకెవరూ న్యాయం చేయలేరని. అతను అనుకున్నట్టుగానే జెన్నిఫర్‌తో ఆ సీరియల్‌ హిట్‌ అయింది. ఆ సీరియల్‌తో జెన్నిఫర్‌ అందరి ఫేవరేట్‌ అయింది. 
  • ‘‘యాక్ట్రెస్‌ కాకపోయి ఉంటే ఎయిర్‌హోస్టెస్‌ అయ్యేదాన్ని’ అంటుంది జెన్నిఫర్‌ వింగెట్‌. 
  •  వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ.. ‘డామేజ్డ్‌ 2’, ‘కోడ్‌ ఎమ్‌’తో. ‘ఫిర్‌ సే’ అనే వెబ్‌ మూవీలోనూ హీరోయిన్‌గా నటించింది కునాల్‌ కొహ్లీ పక్కన. అయితే ఇది 2015లో ఫీచర్‌ ఫిల్మ్‌గానే థియేటర్‌లలో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల 2018లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అయింది. 
  • ఫిట్‌నెస్‌ పట్ల చాలా శ్రద్ధ జెన్నిఫర్‌కు. వ్యాయామంతోనే ఆమె రోజు, కూరగాయల జ్యూస్‌తో ఆమె డైట్‌ ప్రారంభమవుతుంది.   
  • అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్‌ చేయడం. 
  • డ్రీమ్‌రోల్‌.. ‘బ్లాక్‌’ సినిమాలో రాణీ ముఖర్జీ ధరించిన పాత్ర.
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా