వంటింటి చిట్కాలతో వింటర్‌ కష్టాలు పరార్‌: సోహా అలీఖాన్‌

28 Nov, 2021 16:03 IST|Sakshi

బాలీవుడ్‌ తారల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ అందర్నీ ఆకట్టుకునే కొందరిలో సైఫ్‌ సోదరి నటి సోహా అలీఖాన్‌ కూడా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన వర్కవుట్స్‌ వీడియోస్‌ ద్వారా ఈ మధ్య వయసు నటి అందర్నీ ఆకట్టుకున్న సోహా... సంప్రదాయ వైద్య చిట్కాలనే తాను ఫాలో అవుతానని అంటోంది. తన ఆరోగ్య రహస్యం అదేనని చెప్పిందీమె. ప్రస్తుత వింటర్‌ సీజన్‌ను ఎదుర్కోవడానికి ఫ్యాన్స్‌ కోసం కొన్ని టిప్స్‌ కూడా ఇస్తోంది. ఆమె ఏం చెప్తోందంటే...

‘వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. మన ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకం ఇది.  యోగా సాధన ఈ సీజన్‌లో చాలా మంచిది. వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటానికి  శరీరానికి కొంత సమయం ఇవ్వడం అవసరం.

అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు నేను మా పెద్ద వాళ్ల అడుగు జాడల్లో నడుస్తుంటాను. మా అమ్మ చిన్నప్పుడు మా కోసం చేసినట్టు.. విక్స్‌ వ్యాపోరబ్‌తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్, కర్పూరం, పుదీనా వంటి వాటిని వంటింటి వైద్యంలో భాగంగా వినియోగించడం చేస్తాను. తగినంత వేడిగా ఉండే వంటకాలు, సీజన్‌కు తగ్గట్టుగా  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా శ్వాస కోస వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. నా కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని అమితంగా ఇష్టపడతాను.  అది కూడా నాకు చాలా రిలీఫ్‌ ఇస్తుంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు