శునకస్వామ్యం.. తుమ్ములతో మద్దతు ప్రకటన!

31 Oct, 2021 11:52 IST|Sakshi

ఓటింగ్,  మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం.

తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని  నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. 

చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్‌ అనుకునేరు.. నిజమైనదే!

మరిన్ని వార్తలు