ఏసీ వాడుతున్నారా? ఇవి మీకోసమే

25 Mar, 2021 08:50 IST|Sakshi

ఎయిర్‌ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ఎయిర్‌ కండిషనర్‌తో ప్రయోజనాలివి...  

ఎయిర్‌ కండిషనర్‌ కారణంగా గది ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణం లో ఉంటుంది. ఇలా ఉంచడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనర్థాలూ, అనారోగ్యాల బారిన మనం పడకుండా చూస్తాయవి.   
కొన్ని అధునాతన ఎయిర్‌ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్‌ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్‌ పొల్యుటెంట్స్‌) నుంచి మనల్ని కాపాడతాయి.  
బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్‌ కండిషనర్స్‌ మనల్ని కాపాడుతాయి. 

నష్టాలివి... 
పైన పేర్కొన్న ప్రయోజనాలిచ్చే ఇవే ఎయిర్‌కండిషనర్లతో కొన్ని నష్టాలూ ఉంటాయి. అవి... 
బయటి ఫ్రెష్‌ గాలులు చాలాకాలం పాటు సోకకుండా ఉన్నందున కొందరిలో ఏసీ కారణంగా కార్డియోవాస్కు్కలార్‌ సమస్యలు, శ్వాసకోశ సమస్యలైన ఆస్థమా, పిల్లికూతలు రావచ్చు. 
కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్‌ వంటి వ్యాధులూ రావచ్చు. 
కొందరిలో అదేపనిగా ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండటంతో కిడ్నీలో స్టోన్స్‌ ఏర్పడవచ్చు. 
కొందరిలో చర్మంపై దురదలు, తలనొప్పులు, అలసట వంటివి రావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్‌ ఎయిర్‌ తీసుకుంటూ ఉండాలి. దానికోసం వాతావరణంలో కాలుష్యం తక్కువగా ఉండే వేళల్లో (సాధారణంగా ఉదయం వేళల్లో) ఆరుబయటికి రావడం మంచిది. 
ఏసీలోని ఫిల్టర్స్‌ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. 
ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని బిగించాలి. 
ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తుంటే (అంటే ఏసీ సరిపడనివాళ్లు) వాటిని వీలైనంతగా  అవాయిడ్‌ చేయాలి. లేదా తక్కువగా వాడాలి.

చదవండి: అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌.. ఓపెనింగ్‌ ఎప్పుడంటే!‌

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్‌

మరిన్ని వార్తలు