విత్తనాలు వెదజల్లే డ్రోన్‌..10 కోట్ల వృక్షాలే టార్గెట్‌గా

31 May, 2022 22:15 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరిస్తున్నాయి. ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నా, అవేవీ ఎడాపెడా చెట్లు నరికేస్తున్నంత వేగంగా మొక్కలు నాటడంలో సఫలం కాలేకపోతున్నాయి. చెట్లు నరికేసినంత వేగంగా మొక్కలు నాటడం మానవమాత్రుల వల్ల కాదని చెప్పి, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘ఎయిర్‌ సీడ్‌ టెక్నాలజీ’ ఫొటోలో కనిపిస్తున్న ఈ డ్రోన్‌ను రూపొందించింది.

ఈ డ్రోన్‌ శరవేగంగా గగనతలంలో ప్రయాణిస్తూ, భూమిమీద ఖాళీగా ఉన్న బంజరు నేలలను గుర్తించి, అనువైన చోట విత్తనాలను నాటగలదు. మరో రెండేళ్లలోగా ఆస్ట్రేలియాలో 10 కోట్ల వృక్షాలను నాటే దిశగా, ఇలాంటి డ్రోన్‌లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించనున్నట్లు ‘ఎయిర్‌ సీడ్‌ టెక్నాలజీ’ చెబుతోంది. 

మరిన్ని వార్తలు