బెస్ట్ కుకర్
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్‌తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు.
ఈ కుకర్‌లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్‌కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు.
మెయిన్ పార్ట్‌లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది.
ధర : 252 డాలర్లు (రూ.19,313)
చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే!
చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990