Amarnath Vasireddy: దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది! మనదైతే కంపు... అదే వారిదైతే!

10 Sep, 2022 14:49 IST|Sakshi

ఏ రాజ్యంలో , ఏ దేశంలో రాజులు ప్రజలకు మేలుచేసిండ్రు ... ? ఒక ప్రఖ్యాతి పొందిన పాట ! నిజమే !
ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ? నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం ... శ్రీ శ్రీ ..
రాజులకు , బ్రిటిష్ వలస పాలనకు ఒక మౌలిక తేడా ఉంది.

ఒక రాజు ఎంత క్రూరుడైనా, అధిక పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జుర్రినా , ఆ డబ్బు తన విలాసాలకు తగలెట్టినా ఆ డబ్బు ఇక్కడే వుండేది. ఆ  రాజు గారి విలాసాల వల్ల కనీసం  కొంతమందికి ఉపాధి వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే సర్కులేట్ అయ్యేది. 

బ్రిటిష్ పాలనలో మన సంపద వారి దేశానికి తరలి వెళ్ళిపోయింది. మహానుభావుడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆన్ ఇండియా గా పేరొందిన దాదాభాయ్ నౌరోజి తన "పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే గ్రంధం లో "డ్రైన్ అఫ్ వెల్త్ "అంటే సంపద జుర్రుడు లేదా సంపద వలస సిద్ధాంతం లో దీన్ని  వివరించాడు . అందరు స్వతంత్ర సమర యోధులకు ఈ గ్రంధం మార్గదర్శి అయ్యింది. 

బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వారు తమ దేశానికి తరలించిన సంపద విలువ సుమారుగా రెండు వేల అయిదువందల లక్షల కోట్లు (ఇరవై అయిదు ట్రిలియన్ పౌండ్లు)

బ్రిటిష్ వారి కారణంగా కృత్రిమ అంటే మానవ ప్రేరేపిత కరువులు వచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు ఆకలితో కరువుతో పెద్దగా చనిపోయిన దాఖలాలు లేవు. బ్రిటిష్ వారి కాలం లో కరువుతో ఆకలితో చనిపోయిన వారు సంఖ్య మూడు కోట్లు.

పెద్దామె చనిపోతే అయ్యో పాపం అనడం తప్పుకాదు. ఇంగ్లాండ్ వెళ్లి ఉద్యోగం  చెయ్యడం తప్పుకాదు. బతుకు తెరువు కోసం, మెరుగైన జీవనం కోసం వలసలు సహజం. అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకోండి అని చెప్పడం లేదు.

చరిత్రనే మరచి లేదా పిల్లి మొగ్గల పుస్తకాలూ చదివి బ్రిటిష్ వారివల్లే మనం డెవలప్ అయ్యాము. మనకు ఉపాధి వచ్చినది అంటే.. మీ అవగాహన, మీ ఇష్టం . తెలియక పొతే అడగండి. ఎన్ని గంటలైనా చెబుతాను. కానీ నాకు తెలిసిందే సర్వం అని మన సమర యోధుల త్యాగఫలాలను అవహేళన చేసేలా మాట్లాడం అన్యాయం. 

ఇలాంటి బ్యాచ్ బ్రిటిష్ కాలంలో కూడా ఉండేది. దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది. అది కాకుండా ఇంకో బ్యాచ్ ఉండేది.. మనదైతే కంపు కొడుతుంది. తెల్లటి బ్రిటిష్ దొరల మలం సువాసనలు వెదజల్లుతుంది అని నమ్మే వారు. ఇది జోక్ కాదు. నిజం. ఇలాంటి కంపు బ్యాచ్తో మాట్లాడే ఓపికే నాకు లేదు.
- అమర్నాద్ వాసిరెడ్డి,
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
చదవండి: Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ

మరిన్ని వార్తలు