Amarnath Vasireddy: పోయిన వారందరూ తిరిగి రావలసిందే.. నాన్న చెప్పింది నిజమే అన్పిస్తోంది!

5 Aug, 2022 12:55 IST|Sakshi

నగరీకరణ... విరుగుట మొదలయ్యిందా?

న్యూయార్క్ నగరం. అమెరికాలో జనాభా పరంగా నెంబర్ వన్ సిటీ. నెంబర్ టు లాస్ ఏంజెల్స్ నాగరానికంటే రెట్టింపు జనాభా! నాలుగు వందల సంవత్సరాల చరిత్ర. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. కానీ.. కరోనా పాండెమిక్ సమయంలో... అంతకు మించి ఇప్పుడు..... వేలాది మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు.

కారణాలు
1. నెలసరి ఆదాయం అద్దెకు సరిపోతుంది.. లేదా సరిపోదు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్.. అద్దెలు అతి భారీ  స్థాయిలో. నెలకు మూడున్నర వేల డాలర్లు. అంటే సుమారుగా రెండు లక్షల ఎనభై వేలు. విల్లాకు కాదండీ...   సింగిల్‌ బెడ్ రూమ్ ఫ్లాట్  అద్దె. సంపాదనంతా అద్దెకు పోతుంది. ఇక బతికేదెట్టా?

2 . తీవ్ర స్థాయిలో ఆర్థిక అసమానతలు . ప్రపంచ కుబేరులు ఇక్కడే . అతి తక్కువ ఆదాయం ఉన్న వారు , నిరుద్యోగులు భారీ సంఖ్యలో .. క్రైమ్ రేట్ భయపెట్టేలా.
౩. ట్రాఫిక్ జామ్స్ , కాలుష్యం 
4. కారు ఎక్కడైనా పార్క్ చేయాలంటే గంటకు కనీసం 50 డాలర్లు, కొన్ని సార్లు వందకు పైగా...!

పెరుగుట విరుగుట కొరకే..
నగరీకరణ ఒక స్థాయికి మించితే ఏమి జరుగుతుందో న్యూయార్క్ ఒక ఉదాహరణ. టోక్యో మరో రకం.. పెద్ద సంఖ్యలో న్యూ యార్క్ నగరాన్ని వదిలి పెట్టి వెళుతున్న ప్రజలు .. గ్రామాలకు , చిన్న నగరాలకు వలస .

మన దేశంలో కూడా ముంబై,  ఢిల్లీ , కోల్కతా , ఒక విధంగా బెంగళూరు ఇదే స్థితికి చేరుకున్నాయనిపిస్తుంది. మా అమ్మ నాన్న టీచర్ లు . చుట్టుపక్కల చాలా మంది బెంగళూరులో ప్లాట్స్ కొనుక్కొని వలస వెళ్లిపోయారు. మా నాన్న  మా సొంత ఊళ్ళో పొలం కొన్నాడు . ‘‘అందరూ నగరాలకు వెళుతుంటే ఇదేంటి నువ్వు గ్రామం లో పొలం కొంటున్నావు?"  అని అడిగా.

"పోయినవారందరూ తిరిగి రావలసిందే" అన్నాడు . అయన మాటలు ఇన్నాళ్లు  వాస్తవం దాల్చలేదు కానీ ..  ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్.....  రివర్స్ మైగ్రేషన్ అనిపిస్తోంది.


- అమర్నాద్ వాసిరెడ్డి,
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు

మరిన్ని వార్తలు