అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే ‍ కాన్వాస్‌గా..వీడియో వైరల్‌!

29 Jan, 2024 10:17 IST|Sakshi

తమ శరీరాలనే కాన్వాస్‌గా చేసుకుని   అద్భుతమై ఆకృతులను మన  కళ్ల ముందు సాక్షాత్కరింప   చేయడం  ఒక కళ. బాడీ పెయింటింగ్  ప్రక్రియ అతి పురాతనమైన కళల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మానవ సంస్కృతిలో కీలకమైనగా భాగంగా ఉంది. యుద్ధం, వేడుకల్లాంటి వివిధ సందర్బాలతోపాటు,  శతృవుల నుంచి కాపాడు కునేందుకు, వేటగాళ్ళు తమను తాము దాచి ఉంచుకోవడానికి  ఈ బాడీ పెయింటింగ్‌ ఉపయోపడిందని భావిస్తారు.  గతంలో ఇలాంటివి  బాడీ పెయింటింగ్‌ చాలానే చూసాం.

తాజాగా అలాంటి బాడీ పెయింటింగ్‌  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు యువతులు  కలిసి బాడీలపై టైగర్‌ ను చిత్రీకరించిన వైనంగా విశేషంగా నిలిచింది.  25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం గమనార్హం.  మరింకెందుకు ఆలస్యం మీరు  కూడా  ఒకసారి  చూసేయండి మరి.

A post shared by Johannes Stoetter Art (@johannesstoetterart)

whatsapp channel

మరిన్ని వార్తలు